RAMA KRISHNA : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను వెనక్కు తీసుకోవాలి
ABN, Publish Date - May 04 , 2024 | 11:22 PM
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైనదని, అది అమల్లోకి వస్తే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. వెంటనే ...
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం విద్య, మే 4: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైనదని, అది అమల్లోకి వస్తే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే పింఛన్ల
విషయంలో వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఫించన్లపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు పక్కనబెట్టారని విమర్శించారు. వృద్ధులు ఎండలకు తాళలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రాణాలు పోగోట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏడుగురు మరణించారని, ఆ పాపం అధికారులదేనని అన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్, ఇండియా కూటమి అనంతపురం అర్బన అభ్యర్థి జాఫర్, ఎంపీ అభ్యర్థి మల్లికార్జున, సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 04 , 2024 | 11:22 PM