ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SUNITHA: భూములను ఆక్రమించారు

ABN, Publish Date - Aug 13 , 2024 | 12:05 AM

అమ్మా.. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు దౌర్జన్యంగా మా భూములను ఆక్రమించుకున్నారు. వారిని ఎదిరించలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేగా మీరే మాకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు ఎమ్మెల్యే పరిటాల సునీతతో మొరపెట్టుకున్నారు.

MLA Paritala Sunitha receiving petitions

మీరే న్యాయం చేయాలి

చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 12: అమ్మా.. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు దౌర్జన్యంగా మా భూములను ఆక్రమించుకున్నారు. వారిని ఎదిరించలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేగా మీరే మాకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు ఎమ్మెల్యే పరిటాల సునీతతో మొరపెట్టుకున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. వారి నుంచి వినతులు స్వీకరించి పలు సమస్యలు పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి సాగులో ఉన్నా ఆనలైన నుంచి తొలగించామని వైసీపీ నాయకులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్హత ఉన్నా అప్పట్లో తమ పింఛన్లను తొలగించారని మరి కొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఉన్నతపాఠశాలలో విద్యార్థులకు తాగునీరు సక్రమంగా లేదని వాటర్‌ఫిల్టర్‌ ఉన్నా మూలన పెట్టారని ఎస్‌ఎంసీ చైర్మనహరి ఫిర్యాదుచేయగా ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓలతో పాటు హెచఎంలను పిలిపించి చురకలు అంటించారు. శ్మశానికి స్థలం కేటాయించాలని పలువురు స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. టీడీపీ నాయకులు ఎల్‌ నారాయణచౌదరి, తహసీల్దార్‌ హమీద్‌బాషా, ఈఓఆర్‌డీ అశోక్‌నాయక్‌, ఏఓ ఉదయ్‌కుమార్‌, కన్వీనర్‌ ముత్యాల్‌రెడ్డి, మాజీఎంపీపీ అంకే అమరేంద్ర, అధికారులు పాల్గొన్నారు. అనంతరం శాఖల వారిగా అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూములను లాక్కోవడం, ఆనలైనలో తొలగించడం వంటి సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై దృష్టిసారించాలని తహసీల్దార్‌ హమీద్‌బాషాను ఆదేశించారు.

నేడు కనగానపల్లికి ఎమ్మెల్యే రాక

ధర్మవరం రూరల్‌ (కనగానపల్లి): ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే పరిటాలసునీత మంగళవారం కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి వస్తున్నట్లు టీడీపీ మండలకన్వీనర్‌ యాతంపోతలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 12:05 AM

Advertising
Advertising
<