Education : విద్యాశాఖలో అదే వాసన..!
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:21 AM
జిల్లా విద్యాశాఖలో ఇప్పటికీ ‘వైసీపీ’ టీచర్లదే రాజ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మార్పు లేదు. గతంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో అడ్డగోలుగా వ్యవహరించిన ఆ పార్టీ వీరవిధేయులు ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎ్‌సఓ పోస్టుపై కన్నేశారు. ఎలాగైనా ఆ పోస్టును సొంతం చేసుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఓ టీచర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐటీ సెల్‌లోని ఈ ...
ప్రభుత్వం మారినా తీరు మారలేదు
చక్రం తిప్పుతున్న వైసీపీ వర్గ టీచర్
ఏఎస్‌ఓ పోస్టు కోసం పైరవీలు
అనంతపురం విద్య, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖలో ఇప్పటికీ ‘వైసీపీ’ టీచర్లదే రాజ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మార్పు లేదు. గతంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో అడ్డగోలుగా వ్యవహరించిన ఆ పార్టీ వీరవిధేయులు ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎ్‌సఓ పోస్టుపై కన్నేశారు. ఎలాగైనా ఆ పోస్టును సొంతం చేసుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఓ టీచర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐటీ సెల్‌లోని ఈ
కిలాడీ టీచర్ అక్రమాలకు, అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. గత ఏడాదిలో జరిగిన టీచర్ల బదిలీలు, సర్దుబాటులో ఆయన చేసిన అక్రమాలపై విచారణ చేయిస్తే... అన్నీ బయటపడుతాయని డీఈఓ ఆఫీస్ సిబ్బంది, సంఘాల నాయకులే బాహటంగా చర్చించుకుంటున్నారు.
మామూలోడు కాదు..
ఆర్‌జేడీ శామ్యూల్ గతంలో జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఆయన కాలంలో సమగ్రశిక్ష ప్రాజెక్టులోకి సదరు టీచర్ డెప్యుటేషనపై అడ్డగోలుగా వచ్చాడు. వచ్చీ రాగానే ఆయనకు సర్వీస్ పేరుతో దగ్గరయ్యాడు. తర్వాత కొంతకాలానికి డీఈఓ ఆఫీ్‌సలోని ఓ కీలక పోస్టులోకి రావాలని ప్రయత్నించాడు. సార్ వద్ద ఉన్న చనువుతో మూడేళ్ల కిందట ఐటీ సెల్‌లోకి ప్రవేశించాడు. ఇక డెప్యుటేషన్లు, వర్క్ అడ్జస్టుమెంట్లలో తల దూర్చి వసూళ్లు చేయడం ప్రారంభించాడు. వసూళ్లలో వాటా ఇస్తూ.. సార్‌కు మరింత దగ్గరవుతూ వచ్చాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొత్త డీఈఓలుగా ఎవరు వచ్చినా మాయ మాటలు, మామూళ్లతో ప్రసన్నం చేసుకున్నాడని చెబుతారు. వైసీపీ ప్రభుత్వంలో డీఈఓ ఆఫీ్‌సలోకి వచ్చిన ఆయన... మూడేళ్ల బాగా హల్‌చల్ చేశాడు. గతంలో ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ సైతం అక్షింతలు వేశారు. ‘ఏంటి..? స్కూల్‌కు వెళ్లి పాఠాలు చెప్పకుండా.. ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినపుడు ఇడ్లీ, సాంబార్ అందిస్తే సరిపోతుందా..?’ అని చీవాట్లు పెట్టారు. కానీ అప్పటి డీఈఓ వైఖరి వల్ల ఆయన బయటపడ్డాడు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ పావులు కదుపుతున్నాడని సమాచారం. ఈ సారి ఎలాగైనా డీఈఓ ఆఫీ్‌సలోని అత్యంత కీలకమైన అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్(ఏఎ్‌సఓ) పోస్టును సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రెగ్యులర్ స్టాఫ్‌కు చుక్కలు
ఐటీ సెల్‌లోని ఈ టీచర్.. డీఈఓ ఆఫీ్‌ససలోని రెగ్యులర్ స్టాఫ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఆఫీ్‌సలో డీఈఓ తర్వాత ఏడీలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కీలకం. వారిని సైతం ఈ టీచర్ లెక్కచేయడం లేదు. ఇష్ట్టారాజ్యంగా, అమర్యాదగా మాట్లాడుతున్నాడని బాధితులు వాపోతున్నారు. డీఈఓతో ఏదైనా ఫైళ్ల విషయంపై మాట్లాడుతామన్నా... ఆయన నిత్యం డీఈఓ పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంటున్నాడని, ప్రతి దాంట్లో తలదూరుస్తున్నాడని వాపోతున్నారు. కార్యాలయంలో జరిగే పైగా ప్రతి విషయాన్ని వైసీపీ వారికి మోస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో పాగా వేసిన వ్యక్తి కూటమి ప్రభుత్వంలో సైతం కీలక పోస్టు కోసం పైరవీలు చేస్తుండటం, ఉన్నతాధికారులను లెక్కలేకుండా మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయ బదిలీలు, సర్దుబాట్లలో మామూళ్ల వసూళ్లపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. కొత్త డీఈఓ ఆయనను కట్టడి చేస్తారా...? లేక గేట్లు ఎత్తేస్తారా అనే చర్చ జరుగుతోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 17 , 2024 | 12:43 AM