MLA DAGGUPATI : గుంతల రోడ్లు చూసి భయపడేవారు
ABN, Publish Date - Nov 05 , 2024 | 12:31 AM
గత ఐదేళ్లలో గుంతల రోడ్లు చూసి ఏపీకి రావాలం టేనే ప్రజలు భయపడేవారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మండలంలోని రుద్రంపేట పంచా యతీ నుంచి తగరకుంట వెళ్లే మార్గంలో గుంతలు పడ్డ రోడ్లకు ‘మిషన పాత హోల్స్ ఫ్రీ’ కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేపట్టారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
రుద్రంపేటలో రోడ్ల మరమ్మతుల పరిశీలన
అనంతపురం రూరల్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో గుంతల రోడ్లు చూసి ఏపీకి రావాలం టేనే ప్రజలు భయపడేవారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మండలంలోని రుద్రంపేట పంచా యతీ నుంచి తగరకుంట వెళ్లే మార్గంలో గుంతలు పడ్డ రోడ్లకు ‘మిషన పాత హోల్స్ ఫ్రీ’ కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేపట్టారు. ఆ పనులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమవారం పరిశీలించా రు. రోడ్లు ఎంత మేర దెబ్బతిన్నాయి? పనులు ఎలా జరుగుతున్నాయి? అనే విషయాలపై ఆరాతీశారు. మరమ్మతుల పనులు నాణ్యంగా చేయాలని అధి కారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. గత వైసీపీ పా లనలో ఈ రోడ్డులో వెళ్లా లంటే గుంతలను చూసి వాహనదారులు జంకే వా రన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తయారైన రహదా రులు చాలా ఉన్నాయ న్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.860 కోట్లతో మిషన పాత హోల్స్ ఫ్రీ ఏపీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రస్తుతం రోడ్లకు మరమ్మతులు చేస్తుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. గత ప్రభుత్వం లాగా ప్రజల సమస్యల్ని గాలికొది లేయలేదని... సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పా టు ప్రజా సమస్యలు పరిష్కరించ డంలో ముందున్నా మని తెలిపారు. ఈకార్యక్రమంలో అర్‌అండ్‌బీ అధికారి కాటమయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు గంగారమ్, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ మీడియా కో ఆర్డినేటర్ హరి, టీడీపీ నాయకులు భక్తవత్సలం నాయుడు, ఎస్‌ఎం భాష, ఖాసిం, వెంకటరాముడు, బాలప్ప, కరుణాకర్, కొండయ్య, సుధాకర్, ఆది పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 05 , 2024 | 12:31 AM