ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA DAGGUPATI: పల్లె పండుగ అంటే ఇదే..

ABN, Publish Date - Oct 15 , 2024 | 11:41 PM

పల్లె పండుగ అంటే ఇదే అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. నెల రోజుల్లో నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీల్లో రూ.3కోట్లతో అభివృద్ధి పనులు చపడతామన్నారు.

Speaking MLA Daggupati Prasad

అనంతపురం రూరల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ అంటే ఇదే అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. నెల రోజుల్లో నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీల్లో రూ.3కోట్లతో అభివృద్ధి పనులు చపడతామన్నారు. మంగళవారం మండలంలోని రాజీవ్‌ కాలనీ పంచాయతీలో పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అధికారం చేపట్టిన వందరోజుల్లోనే పెద్ద ఎత్తున గ్రామాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇందులో డిప్యూటీ సీఎం పవనకల్యాన పాత్ర ఎక్కువగా ఉందన్నారు. పంచాయతీలో రూ.70లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. మొత్తం 11పనులు చేపట్టగా ఇప్పటికే రెండింటిని పూర్తి చేశామన్నారు. ఎంపీడీఓ దివాకర్‌, ఎంపీపీ వరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రాజీవ్‌రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి లలితకుమార్‌, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు జయరాంరెడ్డి, లక్ష్మీనరసింహులు, రాయల్‌ మురళి, సర్పంచు ఆశాబీ, ఎంపీటీసీ రమీజాబి, రమణ, తేజస్విని, సరళ, భవాని, నెట్టెం బాలకృష్ణ, కడియాల కొండన్న, కృష్ణమోహన, రాయల్‌ మధు, హరికుమార్‌, లింగమయ్య, ఆనంద్‌, డిష్‌గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 11:41 PM