ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DULEEP TROPHY: ఈ ఒక్క రోజే..!

ABN, Publish Date - Sep 22 , 2024 | 12:00 AM

దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ పోటీల్లో మూడో రోజు ఇండియా-డి ఆటగాడు రికీ భుయ్‌ 90 పరుగులు సాధించి.. సెంచరీకి చేరువయ్యాడు. బి జట్టు ఆటగాడు వాషింగ్టన సుందర్‌ 87 పరులతో రాణించాడు.

Ricky Bhui (90 not out)

ఆదివారం.. ప్రేక్షకులకు డ్రానందమే..!

సెంచరీకి చేరువలో రికీ భుయ్‌

బి-జట్టును ఆదుకున్న వాషింగ్టన సుందర్‌

దులీప్‌ ట్రోఫీ పోటీలు చివరిరోజుకు చేరాయి. అనంత ఆర్డీటీ మైదానాల్లో (ఏసీజీ-ఎ, బి) ఈనెల 5న మొదలైన జాతీయస్థాయి పోటీలను తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్‌ ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడగలిగారు. వారి ఆటను ఆస్వాదించారు. చివరి రోజు ఆదివారం రెండు మ్యాచలు డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టార్‌ ఆటగాడు రికీ భుయ్‌ సెంచరీకి మరో 10 పరుగుల దూరంలో ఉన్నందున.. ఆరంభంలోనే వెళ్లే ప్రేక్షకులు ఈ ఫీట్‌ను చూసే అవకాశం ఉంటుంది.

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 21: దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ పోటీల్లో మూడో రోజు ఇండియా-డి ఆటగాడు రికీ భుయ్‌ 90 పరుగులు సాధించి.. సెంచరీకి చేరువయ్యాడు. బి జట్టు ఆటగాడు వాషింగ్టన సుందర్‌ 87 పరులతో రాణించాడు. అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఓవర్‌నైట్‌ స్కోర్‌ 216-7తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇండియా-సి జట్టు మరో 18 పరుగులు మాత్రమే జోడించించింది. 34 పరుగులతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పల్కితనారంగ్‌ కేవలం 7 పరుగులు జోడించి 41 పరుగులకు ఔట్‌ అయ్యాడు. వైశాక్‌ విజయ్‌కుమార్‌ 4 పరుగులు జోడించి 18 పరుగులకు వెనుదిరిగాడు. రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన బాబా ఇంద్రజిత(34) తిరిగి బ్యాటింగ్‌కు రాకపోవడంతో జట్టు స్కోరు 234 పరుగులకు పరిమితమైంది. ఇండియా-ఎ బౌలర్లలో ఆవేశఖాన, అఖీబ్‌ఖాన చెరో మూడు వికెట్లు, శాంస్‌ములానీ 2, తనుష్‌ కొటియాన వికెట్‌ తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇండియా-ఎ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 270 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ప్రథమ్‌సింగ్‌ 11 పరుగులు, మయాంక్‌ అగర్వాల్‌ 34 పరుగులు, తిలక్‌వర్మ 19 పరుగులు సాధించారు. రియాన పరాగ్‌ 73 పరుగులు, శషావత రావత 53 పరుగులతో రాణించారు. శాంస్‌ములానీ 8 పరుగులు మాత్రమే చేశారు. కుమార్‌ కషర్గ 40 పరుగులు, తను్‌షకొటియాన 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా-సి బౌలర్లు అన్షుల్‌ కాంబోజ్‌, గౌరవ్‌ యాదవ్‌, మానవ్‌సుతార్‌ చెరో 2వికెట్లు తీశారు. ఇండియా-ఎ జట్టు ఆధిక్యం 333 పరుగులకు చేరింది. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్నాయి.


శతకానికి చేరువలో..

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 210-6తో మూడోరోజు ఆట ఆరంభించిన ఇండియా-బి జట్టు మరో 62 పరుగులు జోడించి 282 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 39 పరుగులతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వాషింగ్టన సుందర్‌ మరో 48 పరుగులు జోడించి 87పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. రాహుల్‌ చాహర్‌ 9 పరుగులు, నవదీప్‌ సైనీ 7, మోహిత అవస్తి 8 పరుగులు చేశారు. వాషింగ్టన సుందర్‌ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించి అండగా నిలిచాడు. ఇండియా-డి బౌలర్లలో సౌరభకుమార్‌ 5 వికెట్లు, అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు, థాకరే 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-డి జట్టులో ఓపెనర్లు దేవ్‌దత్తు పడిక్కిల్‌ 2, కేఎస్‌ భరత 2 పరుగులు చేసి వెనుతిరిగారు. మూడో స్థానంలో వచ్చిన రిక్కీ భుయ్‌ 87 బంతుల్లోనే 10 బౌండరీలు, 3 సిక్సర్లతో 90 పరుగులు సాధించి, ఆకా్‌షసేన గుప్తా(28)తో కలిసి క్రీజులో ఉన్నారు. నిశాంత సింధు 5 పరుగులు చేయగా, కెప్టెన శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధ సెంచరీ సాధించారు. సంజు శ్యాంసన 45 పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-డి జట్టు 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు సాధించింది. ఆధిక్యం 311 పరుగులకు చేరింది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నాయి. రెండు మ్యాచలు డ్రా అయ్యే అవకాశం ఉంది.

Updated Date - Sep 22 , 2024 | 12:00 AM