ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RALLY : హింసలేని సమాజాన్ని నిర్మించాలి: మాజీ ఎమ్మెల్సీ

ABN, Publish Date - Nov 26 , 2024 | 12:09 AM

రాష్ట్రంలో హింస లేని సమా జాన్ని నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పేర్కొన్నారు. హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలోని క్లాక్‌ టవర్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ మీదుగా శ్రీకంఠం సర్కిల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మా జీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గేయానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Former MLC Gayanand is starting the rally

అనంతపురం కల్చరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హింస లేని సమా జాన్ని నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పేర్కొన్నారు. హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలోని క్లాక్‌ టవర్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ మీదుగా శ్రీకంఠం సర్కిల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మా జీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గేయానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ... హింసలేని సమా జాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముఖ్యంగా మహిళల హ క్కులు కాపాడకుండా హింసలేని సమాజాన్ని నిర్మించలేమన్నారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచార దాడులు పెరిగిపోతున్నాయని, వీటికి ముఖ్య కారణం మాదక ద్రవ్యాలు, మద్యం, అశ్లీల చిత్రాలన్నారు. సోమవారం నుంచి డిసెంబరు 10 వరకు కాలేజీలు, హైస్కూళ్లలో హింస వ్యతిరేక అవగా హన కల్పించేలా సదస్సులు నిర్వహించనున్న ట్లు తెలిపారు. అత్యాచార ఘటనలపై ప్రతి జిల్లాలోనూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, జిల్లా కమిటీ సభ్యురాలు లక్ష్మీనరసమ్మ, రెడ్స్‌ స్వచ్చంద సంస్థ నాయకురాళ్లు సుశీల, మహాలక్ష్మి, అనిత, తులసి, కుమారి, షబానా, మాబి, వరలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిద్దు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 26 , 2024 | 12:09 AM