ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VINAYAKA NIMAJJANAM ; నేడు వినాయక నిమజ్జనం

ABN, Publish Date - Sep 13 , 2024 | 12:05 AM

వినాయక చవితి పురస్కరించుకుని హిందూపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం జరు గనుంది. ఈ సందర్భంగ్లా ఎస్పీ రత్న గురువారం సాయంత్రం వినాయక విగ్రహా లు తరలివెళ్లే రహదారులను పరిశీలించారు. శోభయాత్ర ఏర్పాట్లపై ఆరాతీశారు. అనంతరం గుడ్డం కోనేరువద్ద భద్రత ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌పై పరిశీలిం చారు. ముఖ్యంగా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

SP inspecting the road where Shobhayatra will take place

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రత్న

హిందూపురం, సెప్టెంబరు 12 : వినాయక చవితి పురస్కరించుకుని హిందూపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం జరు గనుంది. ఈ సందర్భంగ్లా ఎస్పీ రత్న గురువారం సాయంత్రం వినాయక విగ్రహా లు తరలివెళ్లే రహదారులను పరిశీలించారు. శోభయాత్ర ఏర్పాట్లపై ఆరాతీశారు. అనంతరం గుడ్డం కోనేరువద్ద భద్రత ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌పై పరిశీలిం చారు. ముఖ్యంగా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నిమ జ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూ డాలన్నారు. వినాయకమండలి సభ్యులు సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నిమజ్జనం సందర్భంగా నలుగురు డీఎస్పీలతోపాటు 30 మంది సీఐలు, వంద మంది ఎస్‌ఐలు, 200మంది ఏఎస్‌ఐలు, 300మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, వజ్రావాహనం, స్పెషల్‌పార్టీ సిబ్బంది ఉంటారన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ మహేష్‌, సీఐలు రాజగోపాల్‌నాయుడు, జనార్దన, అబ్దుల్‌ కరీం ఉన్నారు.


పరిశీలించిన టీడీపీ నాయకులు

వినాయక నిమజ్జనం కోసం స్థానిక గుడ్డం కోనేరువద్ద ఏర్పా ట్లను టీడీపీ నాయకులు పరిశీలించారు. జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ మాజీ చైర్మన అనిల్‌కుమార్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్‌, డైమండ్‌బాబు, నవీన, సతీష్‌, గిరి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై మునిసిపల్‌ అధికారులు, డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. గుడ్డం కోనేరువద్ద మునిసిపల్‌ అధికారులు నిమజ్జన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. కోనేరు చుట్టూ లైటింగ్‌, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చే ముఖ్య అతిథుల కోసం డయాస్‌ ఏర్పాటు చేశారు. వీక్షించేందుకు వచ్చే భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మునిసిపల్‌ డీఈ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 13 , 2024 | 12:05 AM

Advertising
Advertising