DMHO: అనుమతిలేని క్లినిక్‌ల సీజ్
ABN, Publish Date - Sep 27 , 2024 | 11:56 PM
పట్టణంలో అర్హతలేని రెండు ప్రైవేట్ క్లినిక్‌లు, ఒక మొలల క్లినిక్‌ను సీజ్ చేసినట్లు డీఎంహెచఓ భ్రమరాంబికాదేవి తెలిపారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న మరో మూడు ప్రైవేట్ క్లినిక్‌కు నోటీసులు ఇచ్చామన్నారు.
రాయదుర్గంలో డీఎంహెచఓ తనిఖీ
రాయదుర్గం రూరల్, సెప్టెంబరు 27: పట్టణంలో అర్హతలేని రెండు ప్రైవేట్ క్లినిక్‌లు, ఒక మొలల క్లినిక్‌ను సీజ్ చేసినట్లు డీఎంహెచఓ భ్రమరాంబికాదేవి తెలిపారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న మరో మూడు ప్రైవేట్ క్లినిక్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. శుక్రవారం పట్టణంలో క్లినిక్‌లను డీఎంహెచఓ తనిఖీ చేశారు. రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుల సర్టిఫికెట్ల వివరాలను ఆరా తీశారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పట్టణంలోని కేర్, సైనిక్ క్లినిక్‌తో పాటు పైల్స్ క్లినిక్‌ను సీజ్ చేశారు. మరో మూడు క్లినిక్‌లకు నోటీసులు ఇచ్చారు. అనంతరం డీఎంహెచఓ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్‌లు నడుపుతూ సెలైన బాటిళ్లు ఎక్కించడం, సూదులు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి గంగాధర, త్యాగరాజు, హేమారెడ్డి, వైద్యులు రాజేంద్రప్రసాద్, కెంచె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Sep 27 , 2024 | 11:56 PM