PUTTAPARTHI: పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టండి: ఆర్డీఓ
ABN, Publish Date - May 22 , 2024 | 11:59 PM
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ భాగ్యరేఖ పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సబ్‌డివిజన పోలీసు అధికారి వాసుదేవన అధ్యక్షతన శాంతిభద్రతల సమస్యలపై ఆర్డీఓ సమీక్షించారు.
పుట్టపర్తి రూరల్, మే 22: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ భాగ్యరేఖ పోలీసు అధికారులకు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సబ్‌డివిజన పోలీసు అధికారి వాసుదేవన అధ్యక్షతన శాంతిభద్రతల సమస్యలపై ఆర్డీఓ సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అనంతరం శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టభద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన అమలులో ఉందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పెట్రోల్‌బంకుల్లో, కిరాణా అంగళ్లలో బాటిళ్లలో డీజిల్, పెట్రోల్ అమ్మడాన్ని నిరోధించాలన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా పెట్రోల్ డీజిల్, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలన్నారు. పేలుడు పదార్ధాలు, టపాసులు, అక్రమ నిల్వలు గుర్తించి సీజ్ చేయాలన్నారు. గత ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన వ్యక్తులను, బైండోవర్ జాబితాను, పరిశీలించి ప్రస్తుత ఎన్నికల్లో వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెక్షన 133(1) సీ కింద రాళ్లు, కర్రలు, రాడ్స్‌వంటి వాటిని నిర్మాణపనులకు మాత్రమే వాడేటట్లు చూడాలన్నారు. వీటన్నింటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈడీటీ నరసింహులు, పుట్టపర్తి, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువు తహసీల్దార్లు వేణుగోపాల్, నాగభూషణం, భారతి, కళావతి, డీఏఓ వెంకటస్వామి, ఓడీసీ ఖాజాబీ, అమడగూరు రామనాథరెడ్డి, పుట్టపర్తి అర్బన సీఐ కొండారెడ్డి, రూరల్ సీఐ రాగిరిరామయ్య, కొత్తచెరువు యూపీ సీఐ రాజారమేష్, ఎస్సైలు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2024 | 11:59 PM