ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

village poison :పల్లెకూట విషం!

ABN, Publish Date - Jun 16 , 2024 | 12:13 AM

నాలుగు గ్రామాలకు చెందిన దాదాపు నాలుగువేల మంది ప్రజలు తాగే నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. వాసన పసిగట్టి జనం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వైసీపీకి ఓట్లు వేయలేదని కోపంతో ఆ పార్టీ నాయకుడు ఒకరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు (రాయదుర్గం నియోజకవర్గం) మండలం తుంబిగనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని...

Police interrogating the villagers

శుద్ధ జలంలో పురుగుల మందు

వాసన రావడంతో బతికిపోయిన జనం

తుంబిగనూరులో అమానవీయ ఘటన

పచ్చని పంటలు.. పైర గాలులు.. చిక్కటి పాలు.. మీగడ పెరుగు..! కల్మశం లేని బంధాలు..! అన్న.. అక్క.. మామ.. పెద్దయ్య.. చిన్నాయన.. ఊరంతా ఇవే పిలుపులు. కులం లేదు.. మతం లేదు.. అందరూ బంధువులే. ఉన్నవన్నీ బంధాలే. నీ చేనులో పనికి నేను.. నా చేనులో పనికి నువ్వు. ఒకరికి కష్టమెస్తే ఊరంతా అండగా నిలిచేది. అదే పల్లెటూరు. ఎక్కడి నుంచి వచ్చిందో రాజకీయ పిశాచి. బంధాలను బలితీసుకుంది. మానవత్వాన్ని మంటగలిపింది. నిష్కల్మశ హృదయాల్లో కాలకూట విషం నింపింది. చూపు.. ఆలోచన.. నడత.. అన్నింటా విషమే..! మన ఊరు.. మన మనుషులు అన్న వివేచన కోల్పోయారు. కొందరు నేరుగా నరికేసుకుంటున్నారు. ఇంకొందరు తడిగుడ్డలతో గొంతులను కోస్తున్నారు. ఊరికి మంచి చేయాల్సిన రాజకీయం.. ఉరి వేస్తోంది. ‘విష రాజకీయమా..? నువ్వెప్పుడు నాశనమౌతావే..? మా పల్లెలను మాకెప్పుడు అప్పగిస్తావే..?’

కణేకల్లు, జూన 15: నాలుగు గ్రామాలకు చెందిన దాదాపు నాలుగువేల మంది ప్రజలు తాగే నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. వాసన పసిగట్టి జనం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వైసీపీకి ఓట్లు వేయలేదని కోపంతో ఆ పార్టీ నాయకుడు ఒకరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు (రాయదుర్గం నియోజకవర్గం) మండలం తుంబిగనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఫిల్టర్‌ వాటర్‌ కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. ఖాళీ డబ్బాను అక్కడే వదిలేశారు. మంచినీటిని తీసుకెళ్లేందుకు శనివారం ఉదయం వచ్చిన స్థానికులు వాసన పసిగట్టారు. విషప్రయోగం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.


ఊరి కోసం ఇస్తే..

2019లో సుజలాన గాలిమరల కంపెనీ వారు స్వచ్ఛందంగా వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసి గ్రామస్థులకు అప్పగించారు. ప్రారంభంలో టీడీపీ ఎంపీటీసీ వన్నూరుస్వామి ఆధీనంలో వాటర్‌ప్లాంట్‌ నిర్వహణ జరిగేది. వైసీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకుడు ఫణీంద్ర వాటర్‌ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుని గ్రామస్థులకు మంచినీటిని అందిస్తున్నారు. ఇలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు వాటర్‌ప్లాంట్‌ను ఆధీనంలోకి తీసుకుని నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడంతో వాటర్‌ప్లాంట్‌ను తమకు అప్పగించాలని వైసీపీ నాయకుడు, సర్పంచ ఫణీంద్రను ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఆయన అంగీకరించలేదు. దీంతో టీడీపీ నాయకులు ఎంపీడీఓకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

వైసీపీవారిపై ఆరోపణలు

వివాదం నేపథ్యంలో గ్రామస్థులు సేవించే మంచినీటిలోకి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి విషం కలిపారు. వాటర్‌ప్లాంట్‌ కిటికీలో నుంచి టర్మినేటర్‌ అనే పురుగుల మందును వేసి.. డబ్బాను అక్కడే వదిలేశారు. ప్లాంట్‌ వాచమన తిప్పయ్య గమనించి కేకలు వేయడంతో దుండగులు వెళ్లిపోయారని


అంటున్నారు. కానీ వాచమన ఉదయం వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ప్రజలు నీటి కోసం వచ్చినపుడు రాత్రి ఇలాంటి సంఘటన జరిగిందని తెలిపాడు. సాధారణ ఎన్నికల్లో ఈ ఊరిలో టీడీపీకి 18 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేక స్థానిక వైసీపీ నాయకులే విష ప్రయోగం చేసి ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనపై కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌ఐ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. జరిగిన సంఘటన హేయమని, ఇందుకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితులలోనూ వదలబోమని డీఎస్పీ అన్నారు. తుంబిగనూరు ప్లాంట్‌ నీటిలో విషం కలపడంతో ప్రతిరోజూ ఇక్కడి నుంచి నీటిని తీసుకువెళ్లి సేవించే స్థానికులతోపాటు గరుడచేడు, మీండ్లపల్లి, నాగేపల్లి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 16 , 2024 | 12:13 AM

Advertising
Advertising