YCP URAVAKONDA: ఉల్లంఘన.. స్వామి భక్తి..!
ABN, Publish Date - Apr 23 , 2024 | 12:40 AM
వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నామినేషన ప్రక్రియలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. నామినేషన కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన అమలులో ఉన్నా.. బేఖాతరు చేశారు. పరిమితి దాటి, పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వరరెడ్డి నామినేషన వేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లగా..

అక్కడికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. రహదారి పక్కన కట్టిన బారికేడ్లను తొలగించి లోపలికి వెళ్లారు. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు లోపలికి వచ్చినా పోలీసులు పట్టనట్లు వ్యవహరించారు. వారిని ఏమీ అనకుండా స్వామి భక్తిని చాటుకున్నారు. నాయకులు, కార్యకర్తలు ఏకంగా జడ్జీ చాంబర్ వరకూ వెళ్లారు. ఈ విషయం గురించి ఎంసీసీ అధికారులను వివరణ కోరగా, రెండో బారికేడ్ నుంచి 100 మీటర్ల వరకూ నిబంధనలు వర్తిస్తాయని చెప్పడం కొసమెరుపు. - ఉరవకొండ
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Apr 23 , 2024 | 12:40 AM