ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VINAYAKA ; వినాయక నిమజ్జనానికి నీటి కష్టాలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 12:03 AM

ఒకవైపు రైతులు హెచఎల్‌సీలో నీరు ఎప్పుడు ప్రవహిస్తాయా అని ఎదురుచూపులు చూస్తున్నారు. అదిఅలా ఉంచితే... ఆ నీరు రాకపోవడంతో వినాయక చవితి సందర్భంగా మూడు రోజులు, ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించిన మండల వాసులు వినాయక విగ్రహాల నిమజ్జనం హెచఎల్‌సీలో అలాగే వదిలేశారు. మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ప్రజలకు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి నీటి కరువు ఎదురైంది.

A scene where the idols were left in the HLC without immersion

నీరులేని కాలువలో విగ్రహాలను వదిలేసిన వైనం

నార్పల, సెప్టెంబరు16: ఒకవైపు రైతులు హెచఎల్‌సీలో నీరు ఎప్పుడు ప్రవహిస్తాయా అని ఎదురుచూపులు చూస్తున్నారు. అదిఅలా ఉంచితే... ఆ నీరు రాకపోవడంతో వినాయక చవితి సందర్భంగా మూడు రోజులు, ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించిన మండల వాసులు వినాయక విగ్రహాల నిమజ్జనం హెచఎల్‌సీలో అలాగే వదిలేశారు. మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ప్రజలకు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి నీటి కరువు ఎదురైంది. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినా సమీప కాలువ ల్లో కానీ, కుంటల్లో కానీ నీరు లేకపోవడం వల్ల నీటి ప్రవాహం లేని హెచఎల్‌సీ వినాయక విగ్ర హాలను వదిలి రావడం చాలా బాధగా ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నా ప్రభుత్వం హెచఎల్‌సీకి నీరు వదలడం లేదన్నారు. కనీసం వర్షాలు పడినా కుంటల్లో , బావుల్లో నీరు ఉండేదని, ఇప్పటి వరకు నార్పల మండలంలో సరైన వర్షాలు కురవడంతో బోర్లలో కాస్తనీరు అడుగంటిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిమజ్జనానికి నీటి కొరత వల్ల విగ్రహాలను ఒట్టి కాలవల్లోనే వదిలేస్తున్నామని అంటున్నారు. పరమేశ్వరుడైనా కరువు నేలపై కనికరం చూపి గంగను వదలాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రజలు అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 17 , 2024 | 12:04 AM

Advertising
Advertising