బాధితులకు అండగా ఉంటాం
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:17 AM
అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చనిపోయిన శివకేశవ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు.
-ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీపీఆర్
- మృతుడి కుటుంబసభ్యులకు పరామర్శ
తాడిపత్రి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చనిపోయిన శివకేశవ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు.
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో గురువారం మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడి భార్య గీత చంటిపిల్లాడితో ఉండడాన్ని గమనించిన జేసీపీఆర్ భావోద్వేగానికి గురయ్యాడు. యాజమాన్యంతో ఆయన సం ప్రదింపులు చేసి బాధిత కుటుంబానికి రూ.30లక్షలు ఇచ్చేలా ఒప్పించారు. దీంతో పాటు పరిశ్రమ నుంచి వచ్చే బీమా, ఇతర ప్రయోజ నాలను యథాతథంగా ఇవ్వాలని, మృతుడి భార్యకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మృతుడు కాంట్రాక్ట్ కార్మికుడు కావడంతో ఆయకు వచ్చే ఆదాయాన్ని భార్యకు నెలనెలా వర్తింపజేయాని కోరారు. ఆమెకు రెండు ఎకరాలు భూమిని కిష్టిపాడులో ఇప్పిస్తామని తెలి పారు. జాయింట్‌కలెక్టర్ శివనారాయణశర్మతో ఫోనలో మాట్లాడి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అంత్యక్రియలకు లక్షరూపాయలు అందజేస్తామని జేసీ హామీ ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరతతో ఫోనలో మాట్లాడారు. కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందజేయాలని కోరారు. కలెక్టర్‌తో మాట్లాడి సాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, సూర్యముని, నరేంద్రనాయుడు, జయచంద్రారెడ్డి, వేలూరు రంగయ్య, చల్లా సూరి, మల్లికార్జునరెడ్డి, చిత్తరంజన రెడ్డి, వేలూరు రాజశేఖర్‌నాయుడు తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Dec 20 , 2024 | 01:17 AM