ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SUNITA : ప్రతి గ్రామంలో రోడ్లు వేయిస్తాం

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:01 AM

టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపా రు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ని గొం దిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గొందిరెడ్డిపల్లిలో రూ. 14.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. రూ. లక్ష సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు.

MLA who is starting CC road works in Gondireddypalli

ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపా రు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ని గొం దిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గొందిరెడ్డిపల్లిలో రూ. 14.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. రూ. లక్ష సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. పుల్లలరేవులో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, రూ. 6.90 లక్షలతో నిర్మిస్తున్న మూడు గోకులం షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వాల్మీకి జయంతి సందర్బంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... ఏ గ్రామం లో ఏ పని చేయాలో ప్రజలు నిర్ణయిస్తే వెంటనే దానిని చేయిస్తామ న్నా రు. ఐదేళ్లలో ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తామని, ప్రతి గ్రామానికి ప్రధాన రహదారి సమస్య లేకుండా పరిష్కరిస్తామన్నారు. వ్రైసీపీ పాలనలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోయారన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు పింఛన్లు, రేషన కార్డులు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలను ఎమ్మె ల్యే దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్‌ విజయకు మారి, మండల ఇనచార్జ్‌ ధర్మవరపు మురళి, మండల కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ సాయినాథ్‌నాయుడు, సర్పంచులు శీనయ్య, తిరుపాలు, ఎంపీటీసీ జాఫర్‌, వెంకటరాముడు, వాటర్‌షెడ్‌ చైర్మన మల్లి, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 18 , 2024 | 12:01 AM