ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SUNITA : ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేస్తాం

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:15 AM

ఇచ్చిన హామీలన్నింటిని ఈ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె మండలంలో విసృతంగా పర్యటించారు. మండలంలోని కుంటిమద్ది, గంగంపల్లి, మా దాపురం, కొత్తగాదికుంట, నసనకోట, దుబ్బార్లపల్లి, తిమ్మాపురం, గరిమేకల పల్లి గ్రామాల్లో రూ.3.60కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.

MLA releasing pamphlets on This is a good government

ఎమ్మెల్యే పరిటాల సునీత

రామగిరి, సెప్టెంబరు 22: ఇచ్చిన హామీలన్నింటిని ఈ ప్రభుత్వం తప్పక అమలు చేస్తుందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె మండలంలో విసృతంగా పర్యటించారు. మండలంలోని కుంటిమద్ది, గంగంపల్లి, మా దాపురం, కొత్తగాదికుంట, నసనకోట, దుబ్బార్లపల్లి, తిమ్మాపురం, గరిమేకల పల్లి గ్రామాల్లో రూ.3.60కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, కరపత్రాలను అందించారు. అనంతరం ఆయాగ్రామాల్లో పరిటాల శ్రీరామ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్‌కట్‌ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గత ఐదేళ్ల జగన పాలనతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామన్నా రు. వంద రోజుల్లోనే రాప్తాడు నియోజకవర్గంలో సీసీరోడ్లకు రూ.25కోట్లు తెచ్చామని, గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయన్నారు. టీడీపీ స్థానిక నాయకులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


నేడు రాప్తాడుకు ఎమ్మెల్యే పరిటాల సునీత రాక

రాప్తాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారని మండల కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు రామినేపల్లి, 11:30కు మైనార్టీ కాలనీ, మధ్యాహ్నం 12:30కు చిన్మయ్‌నగర్‌లో పాల్గొంటారని, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - Sep 23 , 2024 | 12:15 AM