ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BILLS : నిరీక్షణ ఫలించిన వేళ..

ABN, Publish Date - Jun 08 , 2024 | 11:56 PM

ఐదేళ్ల కిందట చేసిన పనులకు కాంట్రాక్టర్లకు వైసీపీ పాలనలో బిల్లులు రాలేదు. వైసీపీ ఓటమి.. కూటమి ఘన విజయంతో తమ కష్టాలు తీరుతాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 వరకూ గుంతకల్లు మునిసిపాలిటీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వివిధ రకాల పనులు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పనుల బిల్లులన్నింటినీ అటకెక్కించేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులనైనా ఇవ్వాల్సింది. కానీ.. అవి కూడా విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను అప్పుల్లో ముంచేశారు. ఇక ...

Amrita Park where bills are pending

ఐదేళ్లుగా కాంట్రాక్టర్లకు అందని బిల్లులు

టీడీపీ హయాంలో పనులు చేయడమే నేరం

అధికార మార్పిడి కోసం వేచి చూసిన బాధితులు

అభివృద్ధి పనుల బిల్లులు రూ.లక్షల్లో పెండింగ్‌

కొత్త ప్రభుత్వం న్యాయం చేస్తుందని విశ్వాసం

గుంతకల్లు, జూన 8: ఐదేళ్ల కిందట చేసిన పనులకు కాంట్రాక్టర్లకు వైసీపీ పాలనలో బిల్లులు రాలేదు. వైసీపీ ఓటమి.. కూటమి ఘన విజయంతో తమ కష్టాలు తీరుతాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 వరకూ గుంతకల్లు మునిసిపాలిటీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వివిధ రకాల పనులు చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పనుల బిల్లులన్నింటినీ అటకెక్కించేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులనైనా ఇవ్వాల్సింది. కానీ.. అవి కూడా విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను అప్పుల్లో ముంచేశారు. ఇక ఎలాగూ వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించదని నిరుత్సాహానికి గురైన


కాంట్రాక్టర్లు.. టీడీపీ గెలవకపోతుందా.. తమ బిల్లులు రాకపోతాయా అని ఆశతో ఎదురుచూశారు.

అమృత బిల్లులకూ దిక్కులేదు

టీడీపీ ప్రభుత్వ హయాంలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలలో తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుధ్య పరిరక్షణ, సుందరీకరణ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద గుంతకల్లు పట్టణంలో పైప్‌లైన్ల నిర్మాణం, పార్కుల ఏర్పాటు పనులను కేటాయుంచారు. పూర్తి అయిన పార్కులకు వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ పేరును పెట్టి.. ఆర్భాటంగా ప్రారంభించింది. పార్కులకు శిలాఫలకాలను ఏర్పాటు చేసుకున్నారుగాని, పనులు చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించలేదు. వైసీపీ అధికారం చేపట్టే నాటికి పార్కు పనులు 10 శాతం పెండింగ్‌ ఉన్నాయి. దీంతో ఆ మిగిలిన పనులను పూర్తిచేయాలని, బిల్లులు చెల్లిస్తామని అధికార పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. కానీ పనులు పూర్తి చేశాక మొండిచేయి చూపించారు.

ఇవన్నీ రావాలి..

కసాపురం రోడ్డులోని వైఎ్‌సఆర్‌ పార్కు పనులు చేసిన కాంట్రాక్టరు ఆనంద్‌కు దాదాపు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. హంపయ్య కాలనీలో పార్కు పనులు చేసిన కాంట్రాక్టరు లింగప్పకు రూ.29 లక్షల బిల్లు బకాయి ఉంది. తాగునీటి పైప్‌లైన వర్కులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణ పనుల బిల్లులు పెండింగులో ఉన్నాయి. అమృత పథకం కింద రోడ్లను తవ్వి, పైప్‌లైన వేసిన కాంట్రాక్టరు.. ధ్వంసమైన రోడ్డును ఈ స్కీం కిందనే పునర్నిర్మించాల్సి ఉంది. కానీ బిల్లులు ఇవ్వనందుకు తవ్విన రోడ్లను అలాగే వదలేశారు. ఈ పైప్‌లైన కారణంగానే కసాపురం రోడ్డు ధ్వంసమైపోయింది. మండీ బజార్‌లో తవ్విన రోడ్డుకు


మరమ్మతులు చేయలేదు. రాకపోకలు ఇబ్బందిగా మారడంతో స్థానిక వ్యాపారులు సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు పనులు చేయించుకున్నారు. హంద్రీనీవాపై పంప్‌హౌస్‌ నిర్మాణ పనులు బిల్లులు రాని కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయాయి.

ఎస్సీ సబ్‌ ప్లాన బిల్లులు పెండింగ్‌

గుంతకల్లు పట్టణంలోని వివేకానంద పాఠశాల వద్ద ఎస్సీ సబ్‌ ప్లాన నిధులతో పైప్‌లైన ఏర్పాటు చేశారు. అ పనులకు సంబంధించి రూ.7 లక్షలు కాంట్రాక్టరు అనిల్‌కు ఇవ్వాల్సి ఉంది. రాజేంద్ర నగర్‌లోని వెంకటేశ్వర ఆలయం వద్ద నిర్మించిన తాగునీటి పైప్‌లైనకు సంబంధించి రూ.4 లక్షల బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఆర్టీసీ బస్టాడు వద్ద నిర్మించిన డివైడర్లకు సంబంధించిన పనులు పూర్తి చేసినా డిపాజిట్‌ సొమ్మును తిరిగి ఇవ్వలేదు. 60 అడుగుల రోడ్డులో వేసిన బటర్‌ ఫ్లై లైట్లకు సంబంధించి రూ.10 లక్షలు, కసాపురం రహదారిలో ఏర్పాటు చేసిన లైట్లకు రూ.8 లక్షలు, పాత గుంతకల్లు బీరప్ప దేవాలయం వద్ద లైటింగ్‌ వర్కుకు రూ.6 లక్షల బిల్లులు కాంట్రాక్టరుకు ఇవ్వలేదు. ఒకటిన్నర సంవత్సరం కిందట టీడీపీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు కోర్టులో కేసు వేసి విజయం సాధించారు. నీరు-చెట్లు, రూరల్‌ రోడ్లకు సంబంధించి కొంతమేర బిల్లులను రాబట్టారు. అంతకు మించి ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఒక్క పైసా చెల్లించలేదు. జగన ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులను అటకెక్కించింది. దీంతో ఎలాగూ బిల్లులు వచ్చే పరిస్థితి లేదనుకుని, కాంట్రాక్టర్లు టీడీపీ ప్రభుత్వం వచ్చేదాకా ఎదురుచూశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక తమ కష్టాలు తీరుతాయని కాంట్రాక్టర్లు విశ్వసిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Read more!

Updated Date - Jun 08 , 2024 | 11:56 PM

Advertising
Advertising