ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Teachers : వీళ్లకు బుద్ధి చెప్పేదెవరు?

ABN, Publish Date - Sep 14 , 2024 | 12:29 AM

డీఈఓను బెదిరిస్తున్నారా..? విద్యాశాఖను కుల రాజకీయాలు శాసిస్తున్నాయా? కుల కుంపట్లు పెట్టుకున్న కొందరు ఎంఈఓలు వివాదాల్లో చిక్కుకుని రోడ్డుపైకి వచ్చారా...?, కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు, నిరసనలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. డీఈఓను కొందరు ఎంఈఓలు, మరికొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని శుక్రవారం పెట్టిన ఓ పోస్టు వైరలైంది. ...

Teachers protesting in Beluguppa

జిల్లా విద్యాశాఖలో రచ్చ బజారుకు..

డీఈఓకు బెదిరింపులు..

సోషల్‌ మీడియాలో పోస్టు

వాట్సా్‌పకు ఎక్కిన ఎంఈఓల వివాదాలు

బెళుగుప్పలో ఎంఈఓల మధ్య వివాదం

విద్యాశాఖను కుదిపేస్తున్న కులరాజకీయాలు

అనంతపురం విద్య, సెప్టెంబరు 13: డీఈఓను బెదిరిస్తున్నారా..? విద్యాశాఖను కుల రాజకీయాలు శాసిస్తున్నాయా? కుల కుంపట్లు పెట్టుకున్న కొందరు ఎంఈఓలు వివాదాల్లో చిక్కుకుని రోడ్డుపైకి వచ్చారా...?, కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు, నిరసనలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. డీఈఓను కొందరు ఎంఈఓలు, మరికొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని శుక్రవారం పెట్టిన ఓ పోస్టు వైరలైంది. బెళుగుప్పలో కొందరు ఉపాధ్యాయులు ఎంఈఓ-2పై చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. దీని వెనుక కుల రాజకీయాలు ఉన్నాయన్న చర్చ ఉపాధ్యాయులు, విద్యాశాఖలో హాట్‌ హాట్‌గా నడుస్తోంది.


బెదిరింపులు నిజమా....?

జిల్లా విద్యాశాఖాధికారిగా వరలక్ష్మి పనిచేస్తున్నారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు నుంచి రీ ప్యాట్రియేషన అయిన మహిళా టీచర్‌కు పోస్టింగ్‌ కోసం ఆమెను ఆమెను ఒక ఎంఈఓ, మరికొందరు బెదిరించారని వాట్స్‌పలో పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. కుల సంఘాలను అడ్డు పెట్టుకుని ముందుకెళ్తున్న కొందరు ఎంఈఓలు, నాయకులు విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారని, ఉన్నతాధికారులను బెదిరించే స్థాయికి వెళ్లారన్నది అందులోని సారాంశం. గతంలో సమగ్రశిక్ష ప్రాజెక్టులో పని చేసిన ఏపీసీలను సైతం ఈ కోటరీ తమ పనుల కోసం బెదిరించిందని పోస్టు పెట్టారు. ఈ పోస్టు జిల్లా విద్యాశాఖను కుదిపేసింది. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు ఉండే వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ పోస్టు చక్కర్లు కొట్టింది. శాఖపరమైన విచారణ జరిగితే వాస్తవాలు బయట పడతాయని అంటున్నారు.

రోడ్డెక్కిన ఎంఈఓల వ్యవహారం...

ఎంఈఓల మధ్య ఉన్న వివాదాలు, వ్యవహారాలు రోడ్డెక్కాయి. బెళుగుప్పలో ఇద్దరు ఎంఈఓల మధ్య, ఎంఈఓ టీచర్ల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఎంఈఓ-1 మల్లారెడ్డి, ఎంఈఓ-2 హరికృష్ణ మధ్య అంతర్గత విభేదాలున్నట్లు సమాచారం. ఎంఈఓ-2కు కొందరు ఉపాధ్యాయులకు మధ్య అంతరం ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల ఎంఈఓ-2 మండలంలోని ఓ స్కూల్‌కు తనిఖీకి వెళ్లడంతో టీచర్లు, ఆయన మధ్య జరిగిన సంభాషణ కొత్త సమస్యకు తెర లేపింది. ఈ ఘటనలోకి కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులూ తల దూర్చారు. ఆఖరికి శుక్రవారం ఉపాధ్యాయులు కొందరు బెళుగుప్ప తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. హరికృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.


అయితే ఇటీవలే డీఈఓ బెళుగుప్ప మండల విద్యాశాఖ భేష్‌ అంటూ ఇద్దరు ఎంఈఓలు, మరో 9 మంది టీచర్లను ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసి అవార్డులు ఇచ్చి సత్కరించారు. మరి ఇలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేసిన కొందరికి పెద్దపీట వేస్తూ... మండలంలో 11 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యవహారమే నడిచినట్టు తెలుస్తోంది. అవార్డుల్లో అక్రమార్కులు, కుల సంఘాల నేతల పెత్తనం వల్లే 10 మండలాలకు ఒక్కటీ ఇవ్వకుండా, కొన్ని మండలాలకే అవార్డుల్లో పెద్ద పీట వేశారని, ఇదే విషయాన్ని ‘ఆంరఽధజ్యోతి’ ఈనెల 5న ప్రత్యేక కథనంలో ప్రస్తావించింది. గత కొంత కాలంగా జిల్లా విద్యాశాఖ పరువు బజారున పడుతోంది. ఒకవైపు డీసీఈబీలో రూ.31.80 లక్షల వర్క్‌ డీఈఓకు తెలియకుండానే నకిలీ ఉత్తర్వులు సృష్టించి స్కాం చేసినట్టు స్పష్టమవుతోంది. మరోవైపు ఎంఈఓలు కుల రాజకీయాలకు తెరతీసి, శాఖ పరువును బజారుకీడుస్తున్నారు. ఇంకోవైపు ఏకంగా డీఈఓపై బెదిరింపులకు దిగుతున్నారు. అయిునా...జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 14 , 2024 | 12:29 AM

Advertising
Advertising