ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pending Bills : వస్తాయో.. రావో ?

ABN, Publish Date - Sep 04 , 2024 | 11:27 PM

ప్రభుత్వ పనులు దక్కితే సంతోషపడ్డారు. చకచకా నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అయితే పనులు ఎంత మేరకు చేసినా బిల్లులు రాకపోవడంతో అర్ధంతరంగా ఆపేశారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వ పాలనలో చేసిన పనులకు బిల్లులు వస్తాయో..

ఏళ్ల తరబడి పెండింగ్‌లో పీఆర్‌ బిల్లులు

రూ. 25 కోట్ల వరకు బకాయిలు

అయోమయంలో కాంట్రాక్టర్లు

అనంతపురం సిటీ, సెప్టెంబరు 4: ప్రభుత్వ పనులు దక్కితే సంతోషపడ్డారు. చకచకా నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అయితే పనులు ఎంత మేరకు చేసినా బిల్లులు రాకపోవడంతో అర్ధంతరంగా ఆపేశారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వ పాలనలో చేసిన పనులకు బిల్లులు వస్తాయో రావోనని సంబంధిత కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన నిర్మాణాలకు సంబంధించి రూ.25 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు బాధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇదంతా వైసీపీ పాలకుల పాపమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే బిల్లులు మంజూరు చేసి ఉంటే ఇప్పుడు తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని వారు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా తమ పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తుందో..? లేదో అని కాంట్రార్లు ఆందోళన చెందుతున్నారు.


జిల్లాలో పెండింగ్‌ బిల్లుల వివరాలు ఇలా..

ఫసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ క్లినిక్‌లు, డిజటల్‌ లైబ్రరీలకు సంబంధించి పెండింగ్‌లు బిల్లులు : రూ. 15 కోట్లు

ఫ గ్రామీణా ప్రాంతాల్లోని సీసీ, బీటీ రోడ్లకు చెందిన పెండింగ్‌లు బిల్లులు : రూ. 10 కోట్లు.

రూ. 25 కోట్ల వరకు పెండింగ్‌..

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు సాగలేదు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ లైబ్రరీల భవనాల పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. బిల్లుల జాప్యంతోనే పనులు జరగలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం భవనాల పరంగా రూ. 15 కోట్లు, సీసీ, బీటీ రోడ్లు పరంగా రూ. 10 కోట్లు మొత్తంగా రూ. 25 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

బిల్లుల పెండింగ్‌ వాస్తవమే

పలు భవనాలు, రోడ్లకు సంబంధించి రూ. 25 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమే. ఇదే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి నివేదించాం. కాంట్రాక్టర్లకు ఇబ్బంది లేకుండా బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందని ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది.

- కేవీ కేవీ ప్రసాద్‌, ఎస్‌ఈ, పంచాయతీ రాజ్‌శాఖ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 11:31 PM

Advertising
Advertising