ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: టీడీపీ బలంగా ఉన్న కేంద్రాల్లో వైసీపీ కుట్ర

ABN, Publish Date - May 14 , 2024 | 12:59 AM

టీడీపీ బలంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో గొడవలు సృష్టించి పోలింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పయ్యావుల కేశవ్‌

కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, మే 13: టీడీపీ బలంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో గొడవలు సృష్టించి పోలింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. పోలింగ్‌ సరళిని కార్యకర్తలను, నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయన్నారు. ఆ కేంద్రాల్లో అదనంగా సమయం ఇవ్వాలని కోరారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెలుతురు లేక గుర్తులు కనబడలేదన్నారు.


టీడీపీకి అనుకూలంగా ఉన్న కేంద్రాల్లో గొడవలు సృష్టించడానికి వైసీపీ నేతల ఆధ్వర్యంలో కుట్రలకు తెరలేపారని విమర్శించారు. పోలీసుల దృష్టికి ఈ చర్యలను తీసుకెళ్లామన్నారు. 30వేల ఓటర్లు ఉన్న ఉరవకొండలో కేవలం పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఒకరిద్దరుతో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఉరవకొండలో ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.

Updated Date - May 14 , 2024 | 12:59 AM

Advertising
Advertising