ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly: నా నోటితో చెప్పలేను.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలనం..

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:05 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై ప్రసంగించిన సీఎం.. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దారుణాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై ప్రసంగించిన సీఎం.. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దారుణాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా.. వాటి మూలాలు ఏపీలోనే ఉండేవని.. వైసీపీ పాలన ఆ విధంగా సాగిందని దుయ్యబట్టారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే టీడీపీ ఆఫీసుపైనే దాడికి తెగబడ్డారన్నారు. గతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా.. గంజాయి బ్యాచే కారణం అని, వైసీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయించడం వల్లే మందుబాబులు గంజాయికకి అలవాటు పడ్డారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లోనే గంజాయి, డ్రగ్స్‌ దొరికేవని సీఎం ఆరోపించారు.


తల్లి, చెల్లిని దూషించినా పట్టించుకోలేదు..

జగన్ తన సొంత తల్లి, చెల్లిని అసభ్యంగా దూషించినా పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. షర్మిలపై వర్రా రవీంద్రారెడ్డి చేసిన పోస్టుల గురించి తన నోటితో తాను చెప్పలేనని అన్నారు. అసెంబ్లీలో ప్రస్తావించడానికి వీల్లేకుండా వర్రా పోస్టులు పెట్టాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్రా పేరుతో వేరే వాళ్లు పోస్టులు పెట్టారని జగన్ అంటున్నారని.. ఇంకా రవీంద్రారెడ్డిని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పైనా అసభ్యకర పోస్టులు పెట్టారని సభ దృష్టికి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. అవినాష్ రెడ్డిపై కేసు పెట్టాలని షర్మిల డిమాండ్ చేస్తు్న్నారని సీఎం తెలిపారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెట్టిస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును తూర్పారబట్టారు. పేటీఎం బ్యాచ్‌ని పెట్టుకుని పోస్టులు పెట్టించారని దుయ్యబట్టారు.


నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తా..

వైసీపీ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని.. దాంట్లో వైసీపీ వారినే ఉద్యోగులుగా నియమించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చేత అసభ్యకర పోస్టులు పెట్టించారని విమర్శించారు. భవిష్యత్‌లో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహిళల భద్రతకు కొత్త చట్టాలు చేశామని తెలిపారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందన్నారు.


జగన్ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు..

తన జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో పోరాడనని.. జగన్ లాంటి వ్యక్తిని మాత్రం చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహుల కోసం రెండు చట్టాలు తెస్తున్నామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కఠిన చట్టాలు తెస్తున్నామన్నారు. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలన్నారు. అమ్మాయిపై అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజు అనే భయం ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేసి ప్రజలకు భరోసా ఇచ్చేందుకే చట్టం చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. నేరాలపై ప్రజలకు చైతన్యం కల్పించేందుకు త్వరలోనే భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 21 , 2024 | 06:05 PM