ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ఇలా చేస్తే నేనే హోం మంత్రిని అవుతా.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 04 , 2024 | 02:52 PM

క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై విచారం వ్యక్తం చేశారు.

pawan kalyan

పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరుగుతున్న ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ఆ ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని కోరారు. సంబంధిత మంత్రులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. హోం మంత్రి పదవి చేపట్టిన తర్వాత వంగలపూడి అనిత పవన్ కల్యాణ్ వద్ద ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ క్రిమినల్స్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు.

ఈ వార్త అప్‌డేట్ అవుతుంది.

Updated Date - Nov 04 , 2024 | 02:56 PM