AP News: అప్పుల కుప్పగా ఏపీ..!!
ABN, Publish Date - May 21 , 2024 | 08:34 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ సర్కార్ (CM Jagan) అప్పుల కుప్పగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు 17 ఏళ్లకు 7.40 శాతం వడ్డీకి తీసుకుంది. మరో రూ.వెయ్యి కోట్ల 7.38 శాతం వడ్డీకి 20 ఏళ్లకు అప్పు తీసుకుంది. సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా గత వారం ఆర్బీఐ నుంచి రూ. 4 వేల కోట్లు అప్పు తీసుకున్న సంగతి తెలిసిందే.
అప్పుల కుప్ప..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పులమయం చేశారు. ఏప్రిల్ నాటికి రూ.13.50 లక్షల కోట్ల అప్పు ఉండేది. ఆ తర్వాత కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి జగన్ సర్కార్ అప్పు తీసుకుంది. 13.50 లక్షల కోట్ల అప్పుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.2 లక్షల భారం పడనుంది. కార్పొరేషన్ల ద్వారా కుప్పలు తెప్పలుగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసింది. 2023 ఫిబ్రవరి ఏపీ అప్పు రూ.9 లక్షల కోట్ల వరకు ఉండేది. ఆ తర్వాత అప్పు చేయడంతో పెరుగుతూ వస్తోంది. 2023 డిసెంబర్ వరకు 11.28 లక్షల కోట్లకు చేరింది. సంపద సృష్టించడంపై సీఎం జగన్ దృష్టిసారించలేదు. కానీ ఎడపెడ అప్పులు మాత్రం చేసేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై భారీగా ఆర్థికభారం మోపుతున్నారు.
Read Latest AP News and Telugu News
Updated Date - May 21 , 2024 | 08:34 PM