వర్మకు మరో నోటీసు
ABN, Publish Date - Nov 22 , 2024 | 05:09 AM
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.
రావికమతం పోలీసులు జారీ.. హైదరాబాద్‌లో అందజేత
అమరావతి, రావికమతం, కడప క్రైం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. రామ్‌గోపాల్‌వర్మ ఈ ఏడాది మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి లోకేశ్‌లను కించపరిచేలా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ మండలంలోని గుడ్డిప గ్రామానికి చెందిన టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి గల్లా నానిబాబు ఫిర్యాదు చేశారు. ‘వర్మపై మార్ఫింగ్ నేరం కేసు నమోదు చేశాం. స్టేషన్‌కు హాజరు కావాలంటూ హైదరాబాద్ వెళ్లి స్వయంగా ఆయనకు 41ఏ నోటీసు అందజేశాం. అయితే వారం రోజులు గడువు ఇవ్వాలని రామ్‌గోపాల్‌వర్మ తరఫు న్యాయవాది కోరారు’ అని ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు. కాగా, రామ్‌గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. కడప వన్‌టౌన్ సీఐ రామకృష్ణకు గురువారం ఐటీడీపీ కడప నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేశారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Updated Date - Nov 22 , 2024 | 05:10 AM