CM Chandrababu Naidu: రేపు మళ్లీ కేబినెట్ భేటీ
ABN, Publish Date - Nov 19 , 2024 | 07:21 PM
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం రాజధాని అమరావతిలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేయాల్సిన అంశాలపై సైతం ఈ సమావేశం వేదికగా చర్చించనున్నట్లు సమాచారం.
అమరావతి, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం జరిగిన తొలి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు.
Also Read: Sabarimala: శబరిమలకు వెళ్తున్నారా.. వాటితో జాగ్రత్త
అలాగే గడిచిన ఐదు నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు.. వాటి పురోగతిపై ఎస్ఐపీబీ ఇప్పటికే చర్చించింది. ఈ ఒప్పందాలు, వాటి స్థితిగతులపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అందులోభాగంగా వాటికి సైతం ఆమోద ముద్ర పడే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
Also Read: దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
ఇక రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ క్యాబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు. ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై బుధవారం జరగబోయే కేబినెట్‌లో చర్చించి.. అనంతరం వాటికి ఆమోదం తెలపనున్నారు.
Also Read: Maharashtra Elections: పోలింగ్ వేళ.. చిక్కుల్లో బీజేపీ
చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. దీపావళి వేళ.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సైతం ప్రారంభించింది.
Also Read: KTR: రేవంత్ సర్కార్‌కి ప్రశ్నలు సంధించిన కేటీఆర్
అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సైతం శ్రీకారం చుట్టేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
High Court: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు
మరోవైపు ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తుంది. ఈ పథకాన్ని సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసినట్లు అయితే.. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలన్నీ దాదాపు ప్రజల్లోకి తీసుకు వెళ్లినట్లు అవుతుంది.
ఇంకోవైపు.. రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. అదీకాక మోదీ సారథ్యంలో ఆయన కేబినెట్ తరచూ సమావేశమవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపైనే కాకుండా.. రాష్ట్రాభివృద్ధిపైన మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి నవంబర్ మాసాంతంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపట్టింది. ఈ బడ్జెట్‌లో సైతం సూపర్ సిక్స్ పథకాలు అమలుకు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 19 , 2024 | 07:24 PM