ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ORR: గందరగోళం లేకుండా ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌

ABN, Publish Date - Dec 26 , 2024 | 04:54 AM

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ ఆర్‌) అలైన్‌మెంట్‌ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే చోట గందరగోళం లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు నిర్దేశించింది.

7 హైవేల అనుసంధానంపై ఎన్‌హెచ్‌కు ప్రభుత్వ సూచనలు

విజయవాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ ఆర్‌) అలైన్‌మెంట్‌ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే చోట గందరగోళం లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు నిర్దేశించింది. ఈ ప్రాజెక్టు మొత్తం 7 జాతీయ రహదారులతో అనుసంధానమవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో అమరావతి రాజధానికి రోడ్డు కనెకి ్టవిటీ ఏర్పడుతుంది. ఈ అలైన్‌మెంట్‌ మలుపులు లేకుండా ఉండేలా చూడటంతో పాటు ఆయా జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. నేరుగా అనుసంధానం అయ్యే చోట ఈ జాగ్రత్తలు బాగా తీసుకోవాలని పేర్కొంది. అలాగే, ట్రంపెట్‌ ఇంటర్‌ చేంజ్‌ల విషయంలో కూడా ఎలాంటి గందరగోళం, సమస్యలకు అవకాశం లేకుండా అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టాల్సిందిగా తెలిపింది. దీంతో అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానమయ్యే మచిలీపట్నం-హైదరాబాద్‌ (ఎన్‌హెచ్‌-65), కొండమోడు-పేరేచర్ల (ఎన్‌హెచ్‌-163ఈజీ), చెన్నై-కోల్‌కతా (ఎన్‌హెచ్‌-16), విజయవాడ-ఖమ్మం-నాగపూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే (ఎన్‌హెచ్‌-163జీ), గుంటూరు-అనంతపురం (ఎన్‌హెచ్‌-544డీ), ఇబ్రహీంపట్నం-జగదల్‌పూర్‌ (ఎన్‌హెచ్‌-30) వంటి వాటి విషయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 04:55 AM