ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada : రాజధాని కేంద్రంగా సంపద సృష్టి!

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:24 AM

అమరావతి రాజధానిగా భవిష్యత్తులో సంపద సృష్టికి అనుసరించాల్సిన విధానాలపై నవీ ముంబైను రాష్ట్ర ప్రభుత్వం మోడల్‌గా తీసుకుంది.

  • అమరావతి ఆర్థిక ప్రగతికి ‘నవీ ముంబై’ ఎకనమిక్‌ మోడల్‌

  • ‘సిడ్కో’తో చేతులు కలిపిన రాష్ట్ర ప్రభుత్వం

విజయవాడ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిగా భవిష్యత్తులో సంపద సృష్టికి అనుసరించాల్సిన విధానాలపై నవీ ముంబైను రాష్ట్ర ప్రభుత్వం మోడల్‌గా తీసుకుంది. మహారాష్ట్రలో నవీముంబైను నిర్మించిన అక్కడి ‘సిటీ అండ్‌ ఇండస్ర్టియల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ మహారాష్ట్ర లిమిటెడ్‌’(సిడ్కో) ఏ విధంగా ప్రబల ఆర్థిక శక్తి గా నిలిచిందో, అదే విధంగా అమరావతి ఆర్థికాభివృద్ధికి పాటించాల్సిన పద్ధతులపై సహకారం తీసుకునేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమరావతి వచ్చిన సిడ్కో ఆర్థికవేత్తలు షేక్‌, కల్యాణ్కర్‌లతో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ కె.భాస్కర్‌ తదితరులు సమావేశమయ్యారు. రాజధానిని సంపద కేంద్రంగా తయారు చేయడానికి నిర్మాణ దశ నుంచే తీసుకోవాల్సిన అంశాలపై దృష్టి సారించామని, దీనికి తగిన సూచనలు అందించాల్సిందిగా సిడ్కో ఆర్థిక వేత్తలను వారు కోరారు. దీనికి సిడ్కో ఆర్థిక వేత్తలు స్పందిస్తూ.. నవీ ముంబై నిర్మాణంలో అనుసరించిన ఆర్థికాభివృద్ధి విధానాలను పవర్‌ పాయింట్‌, వీడి యో ప్రజంటేషన్‌ రూపంలో వివరించారు. వ్యాపార, వాణి జ్య రంగాల అభివృద్ధితో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పనలపై ప్రణాళికలను సిడ్కో ఏ విధంగా అమలు చేసిందో చెప్పారు. రోడ్డు రవాణా వ్యవస్థలపై దృష్టి సారించామని తెలిపారు. అన్ని రంగాల్లోనూ డిజిటల్‌ కనెక్టివిటీ చేపట్టామన్నారు. ఇలా అన్ని ప్రధాన అంశాలను సమన్వయం చేసుకుంటూ స్థూలంగా ఒక ఆర్థిక మోడల్‌ సిటీకి రూపకల్పన చేశామని చెప్పారు. నవీ ముంబై స్వయం ప్రతిపత్తి సాధనపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. నవీ ముంబై బ్రాండ్‌ను ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లిందీ? ఆర్థిక కార్యకలాపాలకు దోహ దం చేసేలా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాలు, విమానాశ్ర య అభివృద్ధి వంటి చర్యలతో పాటు నగరాభివృద్ధిలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయటం వల్ల అనుకున్న లక్ష్యాలను ఇంకా వేగంగా చేపట్టినట్లు వివరించారు.

Updated Date - Nov 24 , 2024 | 04:26 AM