ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెళ్లైన కుమార్తెకూ కారుణ్య ఉద్యోగ హక్కు

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:02 AM

వివాహమైందనే కారణంతో కారుణ్య నియామకం కింద చనిపోయిన ఉద్యోగి స్థానంలో కుమార్తెకు దేవదాయశాఖ అధికారులు ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

  • అమ్మాయికి పెళ్లైనా కుటుంబసభ్యురాలే

  • ఎనిమిది వారాల్లో తగిన ఉద్యోగమివ్వండి

  • దేవాదాయ శాఖకు ఏపీ హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వివాహమైందనే కారణంతో కారుణ్య నియామకం కింద చనిపోయిన ఉద్యోగి స్థానంలో కుమార్తెకు దేవదాయశాఖ అధికారులు ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తండ్రి మృతి చెందేనాటికి భర్త నుంచి విడాకులు తీసుకొని, తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఆ పెళ్లైన కుమార్తె ఆధారాలు చూపించాలన్న ప్రభుత్వ నిబంధనలు వివక్షాపూరితంగా ఉన్నాయని పేర్కొంది. పెళ్లికాని కుమార్తె, కుమారుడి విషయంలో ఇలాంటి నిబంధన ఏదీ లేదని గుర్తుచేసింది. పెళ్లి అయిందనే కారణంతో కారుణ్య నియామకం కింది ఉద్యోగం నిరాకరించడానికి వీల్లేదని కోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ సిరిపల్లి అమ్ములుకు ఉద్యోగం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఆమెకు తక్షణం స్పీపర్‌గా లేదా తగిన ఉద్యోగం కల్పించాలని దేవదాయశాఖ అధికారులను ఆదేశించింది. 2013 జూన్‌ 24 నుంచి సర్వీసు బెనిఫిట్స్‌ కల్పించాలని స్పష్టం చేసింది. ఉత్తర్వులను 8వారాల్లో అమలు చేయాలని తేల్చిచెప్పింది.

Updated Date - Nov 02 , 2024 | 04:02 AM