Kollu Ravindra: రంగంలోకి మినిష్టర్ ... అధికారుల్లో టెన్షన్
ABN, Publish Date - Jun 27 , 2024 | 05:06 PM
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన దిశగా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు వేస్తున్నారు.
మచిలీపట్నం, జూన్ 27: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రక్షాళన దిశగా స్థానిక శాసన సభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో గత జగన్ ప్రభుత్వంతో అంటకాగిన అవినీతి అధికారులపై చర్యలకు ఆయన ఉపక్రమించారు. దీంతో చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన అధికారులపై ఆయన కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక ప్రభుత్వం మారినప్పటికి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రాబర్ట్‌సన్ పేట సీఐపై వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఆయనను వీఆర్‌కు పంపారు. అలాగే గత ప్రభుత్వంలో మచిలీపట్నం తహశీల్దార్ సునీల్ నకిలీ ఇళ్ల పట్టాలపై సంతకాలు పెట్టారనే ఆరోపణల ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు జగన్ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకు సహకరించి... ఏఎస్పీగా పదోన్నతి పొందిన డీఎస్పీ మాసుం బాషాను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని డీజీపీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ జాబితాలో ఇంకెవరెవరున్నారో తెలియక వైసీపీకి అనుకూల అధికారులు బెంబేలెత్తుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కీలక అధికారులు, ఉద్యోగులు సెలవుపై వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో జిల్లా స్థాయి అధికారులపై వేటు తప్పదని అధికార టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 27 , 2024 | 05:12 PM