AP Minister: మరోసారి ఉదారత చాటుకున్న మంత్రి నారా లోకేశ్
ABN, Publish Date - Jul 26 , 2024 | 07:32 PM
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విదేశాల్లో చదువుతున్న తమ కుమార్తెకు పీజు చెల్లించ లేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆ కన్న తండ్రి ప్రజా దర్బార్‌లో వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన.. తన వ్యక్తిగత నగదును ఆ విద్యార్థిని చదువు కోసం చెక్కు రూపంలో అందజేశారు.
అమరావతి, జులై 26: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విదేశాల్లో చదువుతున్న తమ కుమార్తెకు పీజు చెల్లించ లేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆ కన్న తండ్రి ప్రజా దర్బార్‌లో వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన.. తన వ్యక్తిగత నగదును ఆ విద్యార్థిని చదువు కోసం చెక్కు రూపంలో అందజేశారు.
Also Read: Mizoram: రూ.42.38 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్..
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని చినకాకానికి చెందిన గండికోట కార్తీక.. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో మెడిసిన్ జనరల్ ప్రాక్టీషనర్ (ఫిజిషీయన్) కోర్సు 4వ సంవత్సరం చదువుతోంది. అయితే గత జగన్ ప్రభుత్వం విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా కార్తీకకు విదేశీ విద్యకు ఎటువంటి సాయం అందలేదు. దీంతో ఆమె ఉజ్బేకిస్థాన్ వెళ్ల లేకపోయింది. అలాంటి వేళ.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తమ బిడ్డ చదువుకు సాయం అందించాలంటూ.. ఇటీవల కార్తీక తండ్రి శ్రీనివాసరావు ప్రజాదర్బార్లో వినతిపత్రం అందజేశారు.
Also Read: CM Pushkar Singh Dhami: కార్గిల్ విజయ్ దివస్ వేళ ఉత్తరాఖండ్ ‘అగ్నివీరులకు’ గిఫ్ట్
దీనిపై వెంటనే సంబంధిత విద్యార్థిని వివరాలు తెలుసు కోవాల్సిందిగా తన వ్యక్తిగత సిబ్బందిని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఆ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీ నాటికి కార్తీక 4వ ఏడాది ట్యూషన్ ఫీజు చెల్లించి.. కళాశాలకు వెళ్లాల్సి ఉంది. ఇక విదేశీ విద్య పథకానికి ఇంకా కొత్త గైడ్ లైన్స్ రూపొందించ లేదు. దాంతో ప్రభుత్వం పరంగా విద్యార్థిని కార్తీకకు నేరుగా సాయం అందించే అవకాశం లేకుండా పోయింది.
Also Read: Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
విద్యార్థినికి సొంత నిధులు అందజేసిన లోకేశ్..
ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ తనదైన శైలిలో స్పందిస్తూ.. కార్తీక ట్యూషన్ ఫీజుకు అవసరమైన రూ.1.43 లక్షలు తన సొంత నిధుల నుంచి సమకూర్చాలంటూ సిబ్బందిని ఆదేశించారు. అందుకు సంబంధించిన చెక్కును మంత్రి లోకేశ్ శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థిని కార్తీకకు స్వయంగా అందజేశారు. తొలుత ట్యూషన్ పీజు చెల్లించి కళాశాలకు వెళ్లాలని ఈ సందర్బంగా ఆమెకు మంత్రి నారా లోకేశ్ సూచించారు. అలాగే విదేశీ విద్య పథకానికి నూతన గైడ్ లైన్స్ రూపొందించిన అనంతరం ప్రభుత్వం ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తానని విద్యార్థిని కార్తీకకు ఆయన భరోసా కల్పించారు.
Also Read: High alert in Jammu: ఆర్మీ స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?
స్వస్థలానికి చేరుకున్న వీరేంద్ర కుమార్
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్.. 16 నెలల క్రితం ఖతార్ వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత.. తాను నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయానని గుర్తించారు. అక్కడ వీరేంద్ర కుమార్ అనేక కష్టాలు పడ్డారు. ఆ క్రమంలో అతడి బాధలను తెలియజేస్తూ.. ఈ నెల 19వ తేదీన ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారని వీరేంద్ర ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీరేంద్ర తన వీడియో పోస్ట్‌ను చేశారు.
Also Read: Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం
దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలన్నారు. స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని వీరేంద్రకు ఈ సందర్భంగా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఆ క్రమంలో అతడు హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేశ్‌కు వీరేంద్ర కుమార్ కృతజ్జతలు తెలిపారు.
For Latest News and National News click here
Updated Date - Jul 26 , 2024 | 08:33 PM