Ap News: 2022 బ్యాచ్ ఐఏఎ్‌సలకు పోస్టింగ్‌లు
ABN, Publish Date - Aug 26 , 2024 | 06:09 AM
రాష్ట్ర ప్రభుత్వం 2022 బ్యాచ్‌కు చెందిన 8మంది అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2022 బ్యాచ్‌కు చెందిన 8మంది అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జి.విద్యాధరిని చిత్తూరు జేసీగా బదిలీ చేశారు. 31న పదవీ విరమణ చేయనున్న బాపట్ల జేసీ వి.సుబ్బారావు స్థానంలో ప్రభాకర్ జైన్‌ను నియమించారు.
పాడేరు ఐటీడీఏ పీవోగా అభిషేక్‌ను కొనసాగించారు. బి.సహేదిత్ వెంకట్ త్రివినాగ్‌ను మార్కాపురం సబ్ కలెక్టర్‌గా, యశ్వంత్ కుమార్ రెడ్డిని పాలకొండ సబ్ కలెక్టర్‌గా, కేఆర్ కల్పశ్రీని నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా, మంత్రి మౌర్య భరద్వాజ్‌ను పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా, రాఘవేంద్ర మీనాను గూడూరు సబ్ కలెక్టర్‌గా, శౌర్యమన్ పటేల్‌ను పాడేరు సబ్ కలెక్టర్‌గా, తిరుమాణి శ్రీపూజను కందుకూరు సబ్ కలెక్టర్‌గా, సంధ్యనా సిన్హాను తెనాలి సబ్ కలెక్టర్‌గా నియమించారు.
Updated Date - Aug 26 , 2024 | 06:09 AM