ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP PCC Chief: గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 01 , 2024 | 01:17 PM

కాంగ్రెస్ పార్టీలో ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడే గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేడు అమలాపురంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పారన్నారు.

కాకినాడ: కాంగ్రెస్ పార్టీలో ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడే గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నేడు అమలాపురంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పారన్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు టచ్‌లో ఉన్నారని తెలిపారు.

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లోనూ ఇండియా అలయన్స్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఈ నెల 14 వ తేదీ నుంచి రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారని పేర్కొన్నారు. త్వరలో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ ప్రియాంకతో పాటు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు రానున్నారని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.

ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోనే ఇక మీదట తన రాజకీయ ప్రయాణమని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటి వరకూ జగన్ మెప్పు పొందడం కోసం కొందరు నేతలు టీడీపీ, జనసేన పార్టీలతో పాటు ఆ పార్టీల అగ్రనేతలను ఇష్టమొచ్చినట్టుగా దూషించారు. ఇప్పుడు కొందరు నేతల పరిస్థితి వైసీపీలో ఉండలేరు.. అలాగని టీడీపీ, జనసేనల్లోకి వెళ్లలేరు. ఈ క్రమంలోనే వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

Updated Date - Jan 01 , 2024 | 01:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising