ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే తనిఖీల పేరుతో డబ్బు సీజ్..ప్రజలు, నేతల ఆగ్రహం

ABN, Publish Date - Jan 19 , 2024 | 02:21 PM

ఆలూ లేదు సూలూ లేదు అల్లుడి పేరు రామలింగం అన్నట్లుగా ఏపీలో ప్రస్తుత పరిస్థితి తయారైంది. కోడి కొనకముందే మసాలాలు నురుతున్నారు. అవును ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హాడావిడి కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలతోపాటు పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆలూ లేదు సూలూ లేదు అల్లుడి పేరు రామలింగం అన్నట్లుగా ఏపీలో ప్రస్తుత పరిస్థితి తయారైంది. కోడి కొనకముందే మసాలాలు నూరుతున్నారు. అవును ఏపీలో ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హాడావిడి కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలతోపాటు పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ క్రమంలో వారు సొంత పనుల నిమిత్తం తీసుకెళ్తున్న నగదు లేదా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని వాపోతున్నారు.

అయితే ఈ అంశంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వైసీపీ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజలను తనిఖీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఎన్నికలతో సంబంధం లేని డబ్బు, బంగారాన్ని అధికారులు ఎలా స్వాధీనం చేసుకుంటారని అన్నారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Jagan: సుప్రీంకోర్టులో జగన్‌కు ఎదురుదెబ్బ.. ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం

ఇటీవల నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె పెళ్లికి బంగారం కొనేందుకు తెచ్చుకున్న డబ్బును కూడా పోలీసులు తనిఖీల్లో సీజ్ చేశారని వరదరాజుల రెడ్డి అన్నారు. దీంతోపాటు కొంత మంది వ్యాపారుల డబ్బును కూడా పట్టుకుంటున్నారని వెల్లడించారు. ఇలా ప్రతి రోజు తనిఖీలు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. అలాంటి క్రమంలో ప్రజలు స్వాధీనం చేసుకున్న డబ్బు లేదా బంగారాన్ని తిరిగి ఎప్పుడిస్తారని భయాందోళన చెందుతున్నట్లు చెప్పారు.

ఇప్పటికైనా ఇలాంటి తనిఖీలను ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఏపీలో గతంలో మార్చి 19, 2019న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో మార్చి 2024 మూడో వారంలో రాష్ట్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Jan 19 , 2024 | 03:08 PM

Advertising
Advertising