AP Politics: సజ్జల తనయుడికి మరో షాకిచ్చిన పోలీసులు
ABN, Publish Date - Nov 12 , 2024 | 05:38 PM
సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డికి ఏపీ పోలీసులు మరోసారి షాకిచ్చారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు వారిని దేశం దాటకుండా ఉండేందుకు కట్టడి చేశారు. ఈ మేరకు తాజా నోటీసలు జారీ చేశారు.
అమరావతి: పలువురు కీలక వైఎస్సార్సీపీ నేతలకు ఏపీ పోలీసులు షాకిచ్చారు. ఆ పార్టీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, మరి కొంతమందిపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేశారు. గత శుక్రవారం హైదరాబాద్ లోని మణికొండ వద్ద భార్గవ్ రెడ్డి కదలికలను పోలీసులు ట్రేస్ చేశారు. గురువారం ఎల్వోసీ జారీ చేశారు. భార్గవ్ రెడ్డి పై ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 8న పులివెందులలో వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భార్గవ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో వీరిద్దరి కోసం ప్రత్యేక ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇవి కూడా చదవండి..
BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్
Attack on Collector: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో విస్తుపోయే నిజాలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 12 , 2024 | 05:39 PM