ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: అచ్చెన్నాయుడి తల్లి మృతి: చంద్రబాబు, లోకేష్ సంతాపం

ABN, Publish Date - Mar 31 , 2024 | 04:18 PM

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాతృమూర్తి కళావతమ్మ మృతి చెందారు. ఆమె మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడ నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కళావతమ్మ మృతి బాధాకరమన్నారు.

అమరావతి, మార్చి31: ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) మాతృమూర్తి కళావతమ్మ మృతి చెందారు. ఆమె మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడ నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సంతాపం ప్రకటించారు. కళావతమ్మ మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కింజరాపు కుటుంబానికి ఈ సందర్బంగా చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు కళావతమ్మ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (naraLokesh) స్పందించారు. కళావతమ్మ మృతి కింజారాపు కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. కళావతమ్మకు కన్నీటి నివాళులర్పిస్తూ.. కింజారపు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

అచ్చెన్నాయుడి తల్లి కళావతమ్మ ఆదివారం కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. కింజారపు కళావతమ్మ ఆమె భర్త దాలినాయుడు. ఈ దంపతులకు ఏడుగురు సంతానం. నలుగురు మగ పిల్లలు కాగా.. ముగ్గురు ఆడపిల్లలు. కళావతమ్మ మృతితో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కింజారపు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో విషాధ చాయలు అలముకొన్నాయి.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Elections 2024 : సీఎస్‌కు చంద్రబాబు లేఖ


BJP: ఒంటరిగానే బీజేపీ 370 సీట్లు సాధిస్తుంది... జీవీఎల్ ధీమా

Updated Date - Mar 31 , 2024 | 04:31 PM

Advertising
Advertising