ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Andhra Pradesh: అన్ని వ్యవస్థలను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తున్నారు.. గిడుగు రుద్రరాజు ఫైర్..

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:43 AM

రాష్ట్రంలోని అధికార వైసీపీపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్‌ ను జగన్ ..

రాష్ట్రంలోని అధికార వైసీపీపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్‌ ను జగన్ మ్యానిఫెస్టోలో పెట్టి విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ వచ్చాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి.. యువత నిర్వీర్యం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్ధాలు విచ్ఛలవిడిగా పెరిగిపోతుందని.. యువత మద్యం మత్తులో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులను యువతను నిద్రావస్ధలోకి పంపాలనే కుట్ర జరుగుతుందేమోనని అనుమానం కలుగుతుందని చెప్పారు. మత్తు, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు.

రూ.25 వేల కోట్ల మద్యం పై టార్గెట్ పెట్టి మరీ అమ్మిస్తున్నారు. అధికారుల ట్రాన్ఫర్లు చూశాము. కాని ఎమ్మెల్యే లు, ఎంపీలను, మంత్రులను సిఎం మార్చడం ఇప్పుడే చూస్తున్నాం. ఒక్క నియోజకవర్గంలో చెల్లని రూపాయి మరొక నియోజకవర్గం లో చెల్లుతుందా. కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. బలహీన వర్గాల నేతలనే జగన్ ఇప్పటిదాకా‌ మార్చారు. వ్యవస్ధలన్నింటీనీ జగన్ నిర్వీర్యం చేస్తున్నారు.

- గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు


సమాజంలో అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనేనని, సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్ లో పెను మార్పులు రాబోతున్నాయన్నారు. సెట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ నెల 17 న స్క్రీనింగ్‌ కమిటి చైర్మన్ మధుసూదన్‌ వస్తున్నారని.. ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల కసరత్తు ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు రామమందిరం నిర్మాణమంటూ రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లోకి చేరారని, ఆమె అవసరం ఎక్కడ ఉందో అక్కడ ఆమెను హైకమాండ్ నియమిస్తుందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఆమె రాకను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీలతో పొత్తులపై మాట్లాడుతున్నామని, రాష్ట్రంలో కలిసొచ్చే పార్టీలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని వివరించారు. వారితో భేటీ అయ్యి.. పొత్తులపై చర్చిస్తామని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 11:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising