AP Elections: బస్సుల కోసం ఓటర్లు: అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ‘సెల్ నెంబర్’
ABN, Publish Date - May 12 , 2024 | 07:19 PM
రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు.
అమరావతి, మే 12: రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు.
Mothers Day: అమ్మ పాత్ర ఎప్పటికీ నిత్య నూతనమే
ఓటు హక్కు వినియోగించుకొనేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో ఆ యా బస్సు సర్వీసుల్లో ముందస్తు బుకింగ్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. 40 మంది.. అంతకు మంచి ప్రయాణికులు ఉంటే.. వారంత కలిసి ఒక బస్సుకు రిజర్వేషన్ బుక్ చేసుకొవచ్చని ప్రయాణికులకు సూచించారు. అందుకోసం విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వివరించారు.
Bomb scare in Delhi: ఈ సారి ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు
ఆ క్రమంలో ఈ సెల్ నెంబర్ 9959111281ను సంప్రదించాలని ప్రయాణికులకు వారు విజ్జప్తి చేశారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌కు రావాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చనని చెప్పారు. ఇక ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రత్యేక ఎలక్షన్ సెల్ నెంబర్ 24/7 అందుబాటులో ఉంటుందని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
LokSabha Elections: రేపే నాలుగో దశ పోలింగ్..
Read Latest National News And Telugu News
Updated Date - May 12 , 2024 | 07:19 PM