ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ జైల్లోకి గంజాయి

ABN, Publish Date - Nov 20 , 2024 | 05:35 AM

విశాఖ కేంద్ర కారాగారం లోపలకి గంజాయిని తీసుకువెళ్తున్న జైలు ఆస్పత్రి ఫార్మసిస్టును ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

  • లంచ్‌ బాక్సులో తరలిస్తూ పట్టుబడిన ఫార్మసిస్టు

  • 95 గ్రాముల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం/ఆరిలోవ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్ర కారాగారం లోపలకి గంజాయిని తీసుకువెళ్తున్న జైలు ఆస్పత్రి ఫార్మసిస్టును ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాసరావు ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారంలోని ఆస్పత్రికి వచ్చారు. రిమాండ్‌ ఖైదీ గుర్రాల సాయి చికిత్స కోసం జైలు ఆస్పత్రికి వచ్చినప్పుడు శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. ఇంటి నుంచి డ్యూటీకి వచ్చేటప్పుడు తన సోదరుడు గంజాయి ఇస్తాడని, దాన్ని తీసుకొచ్చి తనకు అందజేస్తే డబ్బులు ఇస్తానని ఆశచూపాడు. అప్పటి నుంచి శ్రీనివాసరావు డ్యూటీకి వచ్చే సమయంలో తన లంచ్‌ బాక్స్‌లో గంజాయి తీసుకొచ్చి సాయికి ఇస్తున్నాడు. జైలు ప్రధాన ద్వారం వద్ద అధికారులు నిర్వహించిన ర్యాండమ్‌ తనిఖీలో శ్రీనివాసరావు లంచ్‌ బాక్స్‌లో 95 గ్రాముల గంజాయిని గుర్తించారు. దీంతో శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Nov 20 , 2024 | 05:35 AM