Share News

Vasantha Krishna Prasad: గతంలో వైసీపీ శాసనసభ్యుడుగా నేను కూడా అందుకు కారకుడినే..

ABN , Publish Date - Sep 07 , 2024 | 01:18 PM

ఉగ్ర ఛానల్, ఉగ్ర నాయకుడు బుడమేరుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. శుక్ర శని ఆదివారాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురిశాయన్నారు.

Vasantha Krishna Prasad: గతంలో వైసీపీ శాసనసభ్యుడుగా నేను కూడా అందుకు కారకుడినే..

అమరావతి: ఉగ్ర ఛానల్, ఉగ్ర నాయకుడు బుడమేరుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. శుక్ర శని ఆదివారాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురిశాయన్నారు. వర్షాలకు తోడు చెరువులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు భారీగా వరద నీరు చేరుకుందన్నారు.


వెలగలేరు రెగ్యులేటర్ వద్ద ఆదివారం సాయంత్రం గేట్లు పై నుంచి వరద నీరు ప్రవహించిందని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ గేట్లు ఎత్తకపోతే విజయవాడ మొత్తం ఇంకా ముంపులోనే ఉండేదని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. టీడీపీ హయంలో 220 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆ పనులన్నీ రద్దు చేసిందన్నారు.


లైనింగ్ పనులకి అప్పట్లో కొబ్బరికాయ కొట్టి మరీ ప్రారంభించానని కానీ వాటిని ఎక్కడా చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అంతా విధ్వంసమేనన్నారు. అసలు వాస్తవాలు బయటికి చెప్పకుండా విషప ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమం తప్పితే దీర్ఘకాలంగా అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టలేదన్నారు. కృష్ణా నదికి 11 లక్షలు వరదరావడం బుడమేరు కూడా ప్రమాద స్థాయిలో వరద రావడం వల్లే గండ్లు తెగాయని వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఇది కచ్చితంగా ప్రకృతి వైపరీత్యమేనన్నారు. గతంలో వైసీపీ శాసనసభ్యుడుగా తాను కూడా అందుకు కారకుడినేనని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 01:18 PM