ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ మహోగ్రరూపం.. చరిత్రలో తొలిసారిగా..

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:22 PM

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే.. కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

అమరావతి: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే.. కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బ్యారేజి వద్ద 11 లక్షల 40 వేల 776 క్యుసెక్కులకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజి చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యాహ్నం తరువాత వరద తగ్గుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కులుగా ఉంది.


విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. 3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి. అలాగే వాయుమార్గం ద్వారా సహాయక చర్యల్లో చాపర్ పాల్గొంటోంది. మరికాసేపట్లో విజయవాడ రానున్న మరో 4 చాపర్స్ రానున్నాయి. ప్రజలు భయాందళోనకు గురికావొద్దని అటు ప్రభుత్వం.. ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.


బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో 40 లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరింది. జలదిగ్బంధంలో 40 లంక గ్రామాలున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద బాబు మాట్లాడుతూ.. ఇప్పటికే 40 బోట్లను రంగంలోకి దింపామని ఆయన తెలిపారు. ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నడూ ఇంత వరద చూడలేదన్నారు. ప్రకాశం బ్యారేజి నిర్మాణం చేసిన తర్వాత తొలిసారిగా ఇంత వరద చూస్తున్నామని ఆనంద బాబు తెలిపారు. ప్రతి గ్రామంలో నిత్యవసరాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అధికారులు గ్రామాలలో అందుబాటులో ఉన్నారన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలన్నారు. ప్రజలు ఎవ్వరూ అధైర్య పడవద్దని.. అంతా ధైర్యంగా ఉండాలని నక్కా ఆనంద బాబు సూచించారు.

Updated Date - Sep 02 , 2024 | 12:22 PM

Advertising
Advertising