ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తోంది.. అంగన్‌వాడీలకు న్యాయం చేస్తాం

ABN, Publish Date - Jan 06 , 2024 | 06:51 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు.

శ్రీకాకుళం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. దుర్మార్గుడు జగన్ సీఎం అయ్యాక ఆందోళన ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎన్‌టీయూసీ (TNTUC) కార్మిక చైతన్య బస్సుయాత్రను ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. టెక్కలి నుంచి కుప్పం వరకు కార్మిక చైతన్య బస్సు యాత్ర సాగనుంది.

"దుర్మార్గుడు జగన్ సీఎం అయ్యాక ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తున్నారు. మరో 3 నెలల్లో టిడిపి ప్రభుత్వం వస్తుంది. అంగన్వాడీలకు న్యాయం చేస్తాం. ఎస్మా జిఓ జగన్ రెడ్డి మడిచి జేబులో పెట్టుకో. జగన్ నా ఎస్సీ, నా బీసీ అని ప్రగల్బాలు పలికారు. మొన్న ఎమ్మెల్యేల బదిలీల్లో ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. నీకు దమ్ముంటే పుంగనూరు పెద్దిరెడ్డిని మార్చు. అంబటి రాయుడు తెలియక వైసీపీలో చేరాడు. 5 రోజుల్లో అంబటి రాయుడుకి జగన్ బండారం అర్ధమయ్యింది. ఐదు రోజులకే డక్ ఔట్ అయ్యిపోయాడు." అని అచ్చెన్నాయుడు అన్నారు.

"వైసీపీ మూనిగిపోతున్న నావ. దీనికి నిదర్శనం జగన్ బాణం చెల్లమ్మ ప్రక్కకు వెళ్లిపోవటమే. ఎన్నికల ముందు అందరికి ముద్దులు పెట్టి.. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు. చివరికి సొంత కుటుంబ సభ్యులనూ వదలడం లేదు. శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేసిన కార్యకర్తలపై పెద్దిరెడ్డి దాడి చేశారు. ఇప్పుడు బస్సు పంపుతున్నాం ఏమి చేస్తావో చూస్తాం." అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 06:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising