ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Atchannaidu: మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన అచ్చెన్నాయుడు

ABN, Publish Date - Jul 24 , 2024 | 11:57 AM

మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్న మాట్లాడుతూ..

అమరావతి: మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్న మాట్లాడుతూ.. త్వరలో కేబినెట్‌లో పెట్టి ఈ జీవోను రద్దు చేస్తామన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని గతంలో అనేక ఆందోళనలు జరిగాయని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షనేత గా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ జీవోను రద్దు చేస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.


మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవోయే నెం.217. రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీల పొట్టకొట్టే, లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డున పడేలా అప్పట్లో జగన్‌ ప్రభుత్వం 217 జీవోను రూపొందించింది. అనాదిగా చెరువుల్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా టెండర్లు పిలిచి దళారులకు దోచిపెట్టేలా సీఎం వ్యవహార శైలి ఉందంటూ అప్పట్లో టీడీపీ నేతలు పలుమార్లు ఆందోళనలు చేశారు.


ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలెండర్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. అయితే 2016 నుంచి 24 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యువజనం పథకం కింద కొంతమందికి ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మా మ్యానిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సలెండర్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో చర్చించి సభా ముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే 674 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకు అందిచాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహయ కేంద్రాలుగా మార్చుతున్నామని నాదేండ్ల మనోహర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

GV Anjaneyulu: జగన్‌వి అన్నీ శవ రాజకీయాలే..

AP News: అరకులో నిలిచిన విద్యుత్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2024 | 11:57 AM

Advertising
Advertising
<