ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాబు ప్రభుత్వం @ 100

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:51 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

రేపు కూటమి ఎమ్మెల్యేల సమావేశం

వంద రోజుల సందర్భంగా ప్రత్యేక భేటీ

సర్కారు విజయాలు, భావి కార్యాచరణపై చర్చ

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బుధవారం (18న) మంగళగిరిలో డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. ఇది 2-3 గంటలపాటు జరిగే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తప్ప.. మూడు పార్టీల ఎమ్మెల్యేలందరినీ దీనికి ఆహ్వానిస్తారు. వంద రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్‌ కార్డులు తయారుచేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత భావించారు. అప్పటికి అవి సిద్ధమైతే ఇవ్వాలని... లేని పక్షంలో తర్వాత ఇవ్వాలని ఇప్పుడు అనుకుంటున్నట్లు సమాచారం. వంద రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఇంకోవైపు.. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. వారంతా మంగళవారం అమరావతిలో అందుబాటులో ఉండాలని కోరినట్లు సమాచారం.

Updated Date - Sep 17 , 2024 | 07:42 AM

Advertising
Advertising