Balashauri and Keshineni Nani: బెజవాడ నుంచి ముంబైకి డైలీ ఫ్లైట్
ABN, Publish Date - Jun 16 , 2024 | 04:18 AM
దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్ ప్రారంభమైంది. విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 7.15 గంటలకు 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్‌ఇండియా ఎయిర్‌బస్ విమానం బయలుదేరింది.
ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని
బెజవాడ నుంచి ముంబైకి డైలీ ఫ్లైట్
ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని
విజయవాడ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్ ప్రారంభమైంది. విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 7.15 గంటలకు 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్‌ఇండియా ఎయిర్‌బస్ విమానం బయలుదేరింది. ముంబై నుంచి విజయవాడకు 153 మంది ప్రయాణికులు రాగా విజయవాడ నుంచి 142 మంది ప్రయాణికులు ముంబైకి బయలుదేరారు. ముంబై విమాన సర్వీసును మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సంయుక్తంగా ప్రారంభించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసిన అనంతరం, ఎంపీలు ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందించారు. విమానానికి ఫైర్ ఇంజన్లతో నీటిని చల్లి స్వాగతం పలికారు.
Updated Date - Jun 16 , 2024 | 04:18 AM