మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP SSC Results: టెన్త్ పాసైన, ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్

ABN, Publish Date - Apr 22 , 2024 | 01:38 PM

ఇవాళ ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో విద్యార్థినులదే పైచేయి. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇక రాష్ట్రంలో 100 శాతం ఉత్తీర్ణత 2,803 పాఠశాలల్లో నమోదయ్యింది. ఇక 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని విద్యాశాఖ కమిషనర్ సురేష్ వెల్లడించారు. అయితే ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ బడులు ఉండగా.. మిగిలిన ఒక్కటి గవర్నమెంట్ స్కూల్‌ కావడం గమనార్హం.

AP SSC Results: టెన్త్ పాసైన, ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్

విజయవాడ: ఇవాళ ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో విద్యార్థినులదే పైచేయి. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇక రాష్ట్రంలో 100 శాతం ఉత్తీర్ణత 2,803 పాఠశాలల్లో నమోదయ్యింది. ఇక 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని విద్యాశాఖ కమిషనర్ సురేష్ వెల్లడించారు. అయితే ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేట్ బడులు ఉండగా.. మిగిలిన ఒక్కటి గవర్నమెంట్ స్కూల్‌ కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆకుల వెంకటసాయి మనస్వి అనే విద్యార్థినికి 600కు 599 మార్కులు వచ్చాయి. దీంతో మనస్వి టాప్‌లో నిలిచింది.

Raghunandan rao: నా గొంతుని కాపాడండి.. మోసపోయి మీరు ఆగం కావొద్దు


ఇక టెన్త్ టెన్త్ పాసైన, ఫెయిల్ అయిన వారికి బిగ్ అలర్ట్ ఏంటంటే.. ఫెయిలైన వారికి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకూ నిర్వహించనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. రేపటి నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్స్ స్వీకరిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేష్ వెల్లడించారు. విద్యార్థులు స్కూలు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాగా విద్యార్థులకు నాలుగు రోజుల్లో షార్ట్ మెమోలు విడుదల చేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి...

మాధవీలతపై కేసు నమోదు

AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్‌‌ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 22 , 2024 | 01:56 PM

Advertising
Advertising