ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు బిగ్ షాక్!

ABN, Publish Date - Mar 11 , 2024 | 05:29 PM

వెఎస్సార్‌సీపీ (YSRCP) కీలక నేత మంత్రి రోజాపై (Minister Roja) సొంత నియోజకవర్గం నగరిలో (Nagari) తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.సొంత పార్టీ నేతలే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తేలేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజాకు బిగ్ షాక్ ఎదురైంది. నగరి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించారు. మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని వారు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీలతో గెలుపొందగా నగరిలో రోజా మాత్రం అంతటి వేవ్‌లోనూ 2 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారని వారు ప్రస్తావించారు.

తిరుపతి: వెఎస్సార్‌సీపీ (YSRCP) కీలక నేత మంత్రి రోజాపై (Minister Roja) సొంత నియోజకవర్గం నగరిలో (Nagari) తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తేలేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజాకు బిగ్ షాక్ ఎదురైంది. నగరి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించారు. మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని వారు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీలతో గెలుపొందగా నగరిలో రోజా మాత్రం అంతటి వేవ్‌లోనూ 2 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారని వారు ప్రస్తావించారు. అప్పుడే అలావుంటే ఇప్పుడు పరిస్థితి ఏవిధంగా ఉంటుందో పార్టీ హైకమాండ్ ఆలోచించుకోవాలని, అన్ని మండలాల్లో వైసీపీ నేతలెవ్వరూ ఆమె పట్ల సుముఖంగా లేరని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పారు.

మంత్రి రోజా పర్యటనల్లో తమకు సమాధానం ఇవ్వడంలేదని సర్పంచులు, ఎంపీటీసీలు వాపోయారు. అభివృద్ధి పనులను చేయనివ్వడంలేదని ఆరోపించారు. ‘‘ చిన్న చిన్న పనులకు కూడా రోజా అన్నలు చెప్పాలి. ఒక అన్నకు డబ్బు ఇచ్చి మరో అన్నకు ఇవ్వక పోతే ఒకరిపై ఒకరు పోటీలు పడి పనులు ఆపించేస్తున్నారు. రోజా సినిమా డైలాగులు, డ్యాన్సులు తప్ప నగరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేదు. మా మాటను హైకమాండ్ పెడచెవిన పెడితే నగరిలో ఓటమి తప్పదు’’ అని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హెచ్చరించారు.

కాగా రోజాకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దని చాలాకాలంగా స్థానిక వైసీపీ కేడర్ డిమాండ్ చేస్తోంది. అభ్యర్థుల కసరత్తు కొనసాగుతున్న వేళ ఈ వేడి మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గం విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

AP News: చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న కీలక భేటీ.. ఈ అంశాలపై చర్చ!

Jagan Govt: ఎన్నికల ముందు వలంటీర్లతో మరో కుట్రకు తెరలేపిన జగన్ ప్రభుత్వం

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 06:05 PM

Advertising
Advertising