ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు

ABN, Publish Date - Jun 26 , 2024 | 02:46 PM

అధికారం కోల్పోయిన అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడికి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ లేఖ రాయడంపై బుధవారం అమరావతిలో ఆయన స్పందించారు.

అమరావతి, జూన్ 26: అధికారం కోల్పోయిన అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడికి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ లేఖ రాయడంపై బుధవారం అమరావతిలో ఆయన స్పందించారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకిస్తారని ప్రశ్నించారు. ఆ పదవి లేక పోతే ప్రజా సమస్యలపై మీరు చర్చించరా? అంటూ సి.రామచంద్రయ్య సందేహం వ్యక్తం చేశారు. అజ్ఞానాన్ని బయట పెట్టుకొంటూ నవ్వులపాటు కావడం అలవాటైపోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా రామచంద్రయ్య చురకలంటించారు.


అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ రాసిన లేఖలో ఓ వింత వాదన, అసంబద్ధమైన వాదన ఉందని అబిప్రాయపడ్డారు. వాటిలో మొదటిది.. తనను ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణం చేయించకుండా.. ఆయన కేబినెట్ సహచరుల అనంతరం ఎమ్మెల్యేగా తనను ప్రమాణం చేయించడం అప్రజాస్వామికమని వైఎస్ జగన్ పేర్కొన్నారన్నారు. అయితే అసలు వైఎస్ జగన్.. తన పార్టీలోని 10 మంది శాసనసభ్యులు కలిసి వైసీపీ నేతగా ఎన్నుకొన్నట్లు ప్రోటెం స్పీకర్‌కు లేఖ ఇవ్వాలన్నారు. కానీ మీరు ఆ లేఖ ఇవ్వనప్పుడు మిమ్మల్ని వైఎస్సాఆర్‌సీపీ శాసనసభ పక్ష నాయకుడని ప్రోటెం స్పీకర్ ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. ఇక మీరు అధికారికంగా లేఖ ఇవ్వక పోయినప్పటికీ గతంలో మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించారన్నారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని మంత్రుల తర్వాత పిలిచారని వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇలా చేయడం ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన గౌరవమని అభివర్ణించారు.


ఇక రెండోది.. ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తింపు ఇవ్వడానికి 10% సీట్లు ఉండాలనే నిబంధన లేదన్నారు. కానీ 10 శాతం సీట్లు రాకున్నా.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే రూల్ గానీ, నిబంధన గానీ ఉందా?.. ఓ వేళ అలాంటిది ఏదైనా ఉంటే మీరు రాసిన లేఖలో ఎందుకు ఆ అంశాన్ని స్పష్టం చేయలేదని రామచంద్రయ్య సందేహం వ్యక్తం చేశారు. మూడోది.. స్పీకర్ మిమ్మల్ని దుర్భాషలాడారన్నారు. స్పీకర్ కాక ముందు అయ్యన్నపాత్రుడు చేసిన రాజకీయ వ్యాఖ్యలను.. ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మాట్లాడడం వాస్తవాల్ని వక్రీకరించినట్లే అవుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సూచించారు. మీరు అధికారంలో ఉన్న సమయంలో పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య నియమాలు పాటించి ఉంటే.. ఓ బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ఉంటే.. ప్రస్తుతం తాము వాటినే అనుసరించే వాళ్లమన్నారు.

కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. ఏనాడు ప్రజాస్వామ్య నిబంధనలు పాటించలేదని ఆయన పేర్కొన్నారు. అసలు రూల్ ఆఫ్ లా అన్నది వైఎస్ జగన్ డిక్షనరీలోనే లేదని సి. రామచంద్రయ్య అన్నారు. నిజంగా ప్రజల సమస్యలపై సభలో సమర్థవంతంగా లేవనెత్తాలంటే.. ఎక్కడ ఏ విధంగా కూర్చున్నామన్నది ముఖ్యం కాదన్నారు. గతంలో కమ్యూనిస్టులు, స్వతంత్ర్య ఎమ్మెల్యేలు ఎటువంటి హోదా లేకున్నా.. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఆ క్రమంలో వారు ఉత్తమ ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందారని వివరించారు.


అయితే బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పగలరా? అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా రామచంద్రయ్య సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో తలపడి వైఎస్ జగన్ ఓడిపోయారన్నారు. అలాంటి వేళ లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి అనుకూలంగా మీ పార్టీ నలుగురు ఎంపీలు ఎందుకు ఓటు వేయాలని నిర్ణయించారన్నారు. అందుకు కారణం ఏమిటో చెప్పగలరా? అని మాజీ సీఎం జగన్‌ను నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మీరు వ్యతిరేకమన్నప్పుడు తటస్థంతా ఎందుకు ఉండడం లేదని వైఎస్ జగన్ వ్యవహారశైలిని ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని వైఎస్ జగన్‌ను ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. వైసీపీని ఓ ప్రైవేట్ లిమిటెడ్‌ అన్నట్లుగా నడపడం వల్లనే ఓటమి ఎదురైందనే విషయాన్ని వైఎస్ జగన్ గుర్తించడం లేదన్నారు. అంతేకాకుండా.. ఆయన ఇంకా అదే పద్దతిలో ముందుకు వెళ్తున్నారన్నారు. దీనిని అజ్ఞానమనాలా? దురంహంకారమనాలా? చెప్పాలని వైఎస్ జగన్ రెడ్డిని ఈ సందర్భంగా సి.రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు.

For More National News and Latest Telugu News click here

Updated Date - Jun 26 , 2024 | 02:51 PM

Advertising
Advertising