ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలవరం నుంచి విశాఖకు గోదావరి జలాలు

ABN, Publish Date - Dec 20 , 2024 | 05:54 AM

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద పోలవరం ఎడమ కాలువ ద్వారా 23.44 టీఎంసీల గోదావరి జలాలను విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చేందుకు పిలిచిన టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

23.44 టీఎంసీల తరలింపు

788.11 కోట్లకు టెండర్లను ఆమోదించిన కేబినెట్‌

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద పోలవరం ఎడమ కాలువ ద్వారా 23.44 టీఎంసీల గోదావరి జలాలను విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చేందుకు పిలిచిన టెండర్లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖ ఈ ఏడాది అక్టోబరు 9న రూ.788,11 కోట్లతో టెండర్లు పిలిచింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజీలు-1, 3, 5, 5ఎ, 6ఎ పనులు పూర్తిగా మందగించడంతో వాటికి టెండర్లు పిలిచారు.

పుంగనూరు బ్రాంచి కెనాల్‌ సీసీ లైనింగ్‌ పనులకు ఆమోదం

హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ విస్తరణలో భాగంగా.. పుంగనూరు బ్రాంచి కెనాల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (సీసీ) లైనింగ్‌ పనులు రూ.480 కోట్లతో చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా ఈ పనులు చేపట్టాలని జల వనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స విస్తరణ పనులకు రూ.1929 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో రూ.480 కోట్లతో పుంగనూరు బ్రాంచి కెనాల్‌ 75.075 కిలోమీటర్ల నుంచి 189.800 కిలోమీటర్ల దాకా సీసీ పనులు చేపట్టాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. 2022-23 నాటి ఎస్‌ఎ్‌సఆర్‌ మేరకు ఈ పనులను ఎన్‌సీసీకి అప్పగిస్తూ జల వనరుల శాఖ తీసుకుంది.

ఎన్‌టీపీసీ-ఏపీజెన్కో జాయింట్‌ వెంచర్‌కు ఆమోదం

ఎన్‌టీపీసీ, ఏపీజెన్కో.. చెరి సగం పెట్టుబడులతో సంప్రదాయేతర ఇంధనోత్పత్తిని చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదించింది. గతనెల 21న సీఎం చంద్రబాబు సమక్షంలో చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందం మేరకు విశాఖ జిల్లా పూడిమడకలో సోలార్‌, విండ్‌, హైబ్రీడ్‌ విధానంలో 25 గిగావాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఎన్‌టీపీసీ, ఏపీజెన్కో నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా 10గిగావాట్‌ పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్తును కూడా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Updated Date - Dec 20 , 2024 | 05:54 AM