ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: గత ఐదేళ్లల్లో ఏం చేశారో తెలుసుకున్నాం

ABN, Publish Date - Aug 05 , 2024 | 10:09 AM

వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ..

విజయవాడ: వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చారన్నారు. వీఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. కాలనీల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని..‌వాటిని పరిష్కారిస్తామన్నారు. వారం‌ క్రితం మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశానని మంత్రి నారాయణ తెలిపారు.


గత ఐదేళ్లల్లో అసలు ఏం చేశారో తెలుసుకున్నామని పేర్కొన్నారు. మనకు నిధులు కొరత చాలా ఉందని.. రూ.27 వేల‌ కోట్లు కేంద్రం నిధులు రాష్ట్రానికి రావాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రూ.17 వేలు కోట్లు కేంద్రం, 17 వేల కోట్లు రాష్ట్రం ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు నిలిపేశారన్నారు. స్వచ్చ భారత్ తరపున నిధులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వక పోవడం వల్ల ఆ నిధులూ ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ‌ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీజేఎంఎస్‌లో రూ.19 కోట్లు కాగితాల్లో ఉన్నాయని.. డబ్బు మాత్రం లేదని మంత్రి నారాయణ తెలిపారు. ఆ నిధులు మొత్తం ఇతర అవసరాలకు మళ్లించేశారన్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు తమకు ఎదురవుతున్నాయన్నారు. సీఎం సహకారంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. మున్సిపల్ మంత్రిగా నారాయణ అనేక నూతన విధానాలను అమలు చేశారన్నారు. 2014-2019 మధ్య కాలంలో పట్టణాలు, నగరాలు సుందరీకణ చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ మంత్రి గా తన పని తీరుతో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి సమస్య బాగా ఉందన్నారు. మురుగు నీరు రోడ్ల పై నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాలు పడితే ప్రజలు ఆనీటితో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గత ఐదేళ్లల్లో నగర అభివృద్ధిని అసలు పట్టించుకోలేదన్నారు. మంత్రి నారాయణ ఒక డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కారానికి సహకరించాలని గద్దె రామ్మోహన్ కోరారు.

Updated Date - Aug 05 , 2024 | 10:09 AM

Advertising
Advertising
<