41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన జగన్‌దే!
ABN, Publish Date - Nov 25 , 2024 | 03:47 AM
పోలవరం ప్రధాన డ్యాం ఎత్తును తొలి దశలో 41.15 మీటర్లకు ప్రతిపాదించింది నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వమేనని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
2021లో పంపితే నిరుడు ఆమోదించాం
పోలవరం కాంటూరుపై తేల్చిచెప్పిన కేంద్ర జలశక్తి శాఖ
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రధాన డ్యాం ఎత్తును తొలి దశలో 41.15 మీటర్లకు ప్రతిపాదించింది నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వమేనని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. 2021లో పంపిన ప్రతిపాదనను 2023లో ఆమోదించామని తెలిపింది. ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు.. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 196.40 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు కూటమి ప్రభుత్వం కుదించిందని జగన్ తాజాగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని అసెంబ్లీ సమావేశాల్లో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధారాలు చూపించి మరీ తేల్చిచెప్పారు. నిజానిజాల నిర్ధారణ కోసం సమాచార హక్కు చట్టం కింద సీనియర్ జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ కేంద్ర జలశక్తి శాఖను సమాచారం కోరగా అందజేసింది. కుంగిన గైడ్‌బండ్ సహా ఇతర మరమ్మతుల పనులను రూ.1,500 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించామని తెలిపింది. వీటికి అదనంగా మరో తొమ్మిది అనుబంధ ఒప్పందాల వల్ల అంచనా వ్యయం రూ.2,077 కోట్లకు చేరినట్లు పేర్కొంది.
Updated Date - Nov 25 , 2024 | 03:47 AM